ఏపీ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను, మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి పోసాని కృష్ణమురళి నేరుగా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఓబలువారి పల్లె పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 14 రోజులు పాటు ఆయనకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అయితే పోసానిపై కేవలం ఒక్క కేసు మాత్రమే కాకుండా వేర్వేరు జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదోనిలో పోసానిపై కేసు వున్నందున పోలీసులు కడప మొబైల్ కోర్టులో పోసాని కృష్టమురళిని హజరుపర్చగా ఆయనకి ఊరట లభించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
పోసానిపై ఇతర జిల్లాల్లో కూడా కేసులు నమోదవటంచేత ఆ కేసుల్లో కూడా బెయిల్ వస్తేనే పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పోసాని కృష్ణమురళిపై వేర్వేరు జిల్లాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో నరసరావుపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని విచారించేందుకు కస్టడీ కోరారు. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. దీంతో నరసరావు పేట టూ టౌన్ పోలీసులు రెండు రోజుల పాటు పాటు పోసానిని విచారించనున్నారు.
ఈ క్రమంలో అతని బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. ఇక ఈ క్రమంలో వైసీపీ వారు.. పోసానికి మద్దతుగా పోసాని ని జైల్లో వుంచామని కూటమి సంబర పడుతుంది, కానీ పోసాని పవరేంటో చూపించాడు అంటున్నారు.