JPS Suicide: జూనియర్ పంచాయతీ సెక్రటరీ సోని ఆత్మహత్య
JPS Suicide: జూనియర్ పంచాయతీ సెక్రటరీ సోని ఆత్మహత్యతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ సెక్రటరీలు (జేపీఎస్ లు) ఆందోళన చేస్తున్నారు.
తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన రావడం లేదు.
ఈ నేపథ్యంలో మనస్థాపం చెందిన ఓ జేపీఎస్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలంలో శుక్రవారం జరిగింది.
అయితే జూనియర్ పంచాయతీ కార్యదర్శి (జేపీఎస్) బైరి సోని(31) ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
రాష్ట్ర వ్యాప్త 11 రోజుల నిరవధిక సమ్మెలో పాల్గొని ఈ నెల 6న విధుల్లో చేరిన సోని అనూహ్యంగా శుక్రవారం మధ్యాహ్నం రంగాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
జేపీఎ్‌సల రెగ్యులరైజ్ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరి వల్లే సోని ఆత్మహత్యకు పాల్పడిందని తోటి ఉద్యోగులు ఆరోపిస్తుండగా, భర్త వేధింపులే కారణమని పోలీసులు చెబుతున్నారు. జేపీఎస్ బైరు సోని (29) సూసైడ్‌కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వరంగల్ నుంచి అదనపు బలగాలను నర్సంపేట మార్చురీకి పంపారు.
వరంగల్ జిల్లా రంగశాయి పేటకు చెందిన రంగు ప్రసాద్‌తో నర్సంపేటకు చెందిన బైరు సోనికి తొమ్మిదేండ్ల క్రితం పెండ్లి జరిగింది.
వీరికి 8 ఏళ్ల పాప ఉంది. అయితే సోని ఆత్మహత్యతో అటు ఖానాపురం, ఇటు నర్సంపేట ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.
సోని కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని పంచాయతీ కార్యదర్శులు భీష్మించడం, అంబులెన్స్‌ను అడ్డుకొని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయడంతో పోలీసులు సందిగ్ధంలో పడిపోయారు.
అయితే ఉద్యోగం పోతుందనే భయం, ఫ్యామిలీలో నెలకొన్న ఇబ్బందుల వల్లనే బైరి సోని ఆత్మహత్య చేసుకున్నారని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు హాస్పిటల్ మార్చురీ ఎదుట నిరసన చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించకుండా అంబులెన్స్ కు అడ్డంగా పడుకున్నారు. దీంతో పోలీసులు వారిని తొలగించారు.
రాత్రి సమయంలో క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నినదించారు.
దీంత స్థానిక ఆర్డీవో, డీసీపీ, డీపీవో రాత్రి సమయంలో నిరసనకారులతో చర్చలు జరిపినా అవి ఫెయిల్ అయ్యాయి.
దీంతో పోలీసులు నిరసనకారులను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. కాగా తండ్రి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, కాంగ్రెస్, టీజేఎస్, ఇతర ప్రజా సంఘాల నాయకులు సోని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం సోని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
శనివారం సోని అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.