Joe Biden : బైడెన్ కి ‘నో’ చెప్పిన కమలా హారిస్
Joe Biden : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కి చుక్కెదురయింది. ప్రపంచంలో ఏ మూలనైనా శాసించగల రాజ్యాధికారాన్ని చేపట్టిన అధ్యక్షుడికి అత్యంత ఘోర పరాభవం ఎదురైంది.
అది కూడా తన మంత్రివర్గ సహచరురాలు, భారతీయ సంతతికి చెందిన ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ వల్ల జరిగింది.
కమలా హారిస్ సూటిగా మొహమాటం లేకుండా బైడెన్ మొహమ్మీదే మీడియా సాక్షిగా ఖరాఖండిగా నో చెప్పింది.
ఇంతా చేసి బైడెన్ ఏమైనా ఫీల్ అయ్యాడా అంటే లేదు సరి కదా కమలా హారిస్ ముందే మోకాళ్ళ మీద మోకరిల్లి ఫోటోలకు ఫోజు ఇవ్వడం మరీ విడ్డూరం.
అది కూడా ఓ అగ్రరాజ్యపు అధ్యక్షుడు భారత దేశ సంతతికి చెందిన మహిళ ముందు మోకాళ్ళ మీద నిల్చోవడం భారత దేశం స్వాతంత్రం సాధించిన తరువాత జరిగిన విశేషమని చెప్పుకోవాలి.
ఇటీవల వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో జిరిగిన ఈ వింత సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
వివరాల్లోకి వెళితే వైట్ హౌస్ ప్రతి ఏటా బాస్కెట్ బాల్ విజేతలను సత్కరించడానికి గోల్డెన్ స్టేట్ వారియర్స్ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు తమ సహచరగణంతో విజేతలతో పాటు ఫోటో షూట్ కార్యక్రమంలో పాల్గొనాల్సివుంటుంది.
ఈ కార్యక్రమంలోనే సదరు జో బైడెన్ అందరూ ఫోటోలో పడాలనే తాపత్రయమో లేక మీడియా వారి దృష్టిని ఆకర్షించాలనో ఓ నవ ప్రేమికుడు ప్రియురాలుకి ప్రపోజ్ చేస్తున్నట్టు మోకరిల్లి కమలా హారిస్ ని కూడా పిలిచాడు.
మరి అధ్యక్షల వారి పోజు నచ్చలేదో లేక ప్రపోజ్ నచ్చలేదో కాని సరిగ్గా ఓ భిక్షగాడిని వదిలించుకోవడానికి పెట్టే చిరాకును ముఖాన అతికించుకుని మొహమాటం లేకుండా నేను అలా చేయను అని బిగ్గరగా అనేసింది.
ఈ హఠాత్ పరిణామానికి సదరు అధ్యక్షుల వారు నివ్వెరపోయినా సమయానికి దానిని కవర్ చేస్తూ మీడియా ముందు ఇచ్చిన పోజును వదలకుండా లేని నవ్వులను మొహం మీద పులుముకొని లోన కమల చేసినదానికి కుమిలిపోయి మీడియాకి బోల్డంత ట్రెండింగ్ కంటెంట్ మాత్రం ఇచ్చారు.
దాంతో ఇంకేముంది ప్రపంచమంతా ఈ న్యూస్ ని ట్రెండ్ చేసే పనిలో పడ్డారు. అనవసరంగా అటకకెక్కి అభాసుపాలవడం ఒక్క అమెరికా అధ్యక్షులకే సాధ్యం. అలాగే సిగ్గు లేకుండా సానుకూలంగా స్పందించడం కూడా వారికే సాధ్యం.
ఈ సంఘటన జరిగిన తరువాత వైట్ హౌస్ వార్తల్లో నిలిచింది కాని వైట్ హౌస్ నుండి ఎటువంటి వార్తా వెలువడక పోవడం విడ్డూరం.
కాని ఓ భారత సంతతికి చెందిన మహిళ ముందు తెల్లవాడు అదీ అధ్యక్షడు మోకరిల్లడం చరిత్రలో ఓ చరగని పేజీ అవుతుందని విశ్లేషకులు ఉటంకిస్తున్నారు.