అంబరాన్నంటిన ‘తామా’ సంక్రాంతి సంబరాలు

జనవరి 21 వతేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా ఆధ్వర్యంలో డెన్మార్క్ హైస్కూల్ ప్రాంగణాన 2000 మంది ప్రవాసుల మధ్య,  42 ఏళ్ళ తామా చరిత్రను తిరగ రాసేవిధంగా అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సంబరాలలో ముఖ్యంగా ముగ్గులపోటీ పలువురిని ఆకర్షించింది. 50మందికి పైగా స్త్రీలు మరియు పిల్లలు కలిసి పాల్గొన్న ఈ ముగ్గుల పోటీలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.  అలాగే సంబరాలలో ఆకర్షణీయంగా 40 షాపింగ్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్టాల్స్ లో రాఫెల్స్ టికెట్స్ తో విజేతలకు విశిష్ట బహుమతులు కూడా అందజేశారు.  ముఖ్యాకర్షణగా ప్రముఖ గాయని గీతామాధురితో అతిథులు సెల్ఫీలు దిగడం సందడిగా జరిగింది. తామా కల్చరల్ సెక్రటరీ తిరు చిల్లపల్లి కార్యక్రమాన్ని సంప్రదాయరీతిలో ఆరంభించారు. అలాగే ప్రెసిడెంట్ సాయిరాం కారుమంచి ఎగ్జిక్యూటివ్ కమిటీని పరిచయం చేశారు. బోర్డు ట్రెషరర్ శ్రీనివాస్ ఉప్పు డైరెక్టర్లను పరిచయం చేశారు . తామా వేడుకలు ఇంత ఘనంగా జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరిని అభినందించారు నిర్వాహకులు.

Leave a Reply