ఇదే భారత్Xపాక్ మధ్య ఫైనల్ అయితేనా.. ఆ లెక్కే యెరుండేది.
ఎన్నో అంచనాల మధ్య టీ20 ప్రపంచకప్ 2022 బరిలోకి దిగిన టీమిండియా.. ఫైనల్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. రోహిత్ సేన జైత్రయాత్ర సెమీస్‌కు మాత్రమే పరిమితమైంది. ఇంగ్లండ్‌తో గత గురువారం జరిగిన సెమీఫైనల్-2లో టీమిండియా సమష్టిగా విఫలమై 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
ఈ ఓటమితో మరోసారి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. అయితే టీమిండియా ఓటమి అభిమానులనే కాదు.. భారత్‌లో కోట్ల వ్యాపారాన్ని దెబ్బతీసింది. అటు బీసీసీఐ, ఐసీసీతో పాటు ఇటు బ్రాడ్కాస్టర్లకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. భారతే గనుక ఫైనల్ చేరి ఉంటే.. దాయాదుల సమరాన్ని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసేది.అప్పుడు అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండేది. గ్రూప్ స్టేజ్‌లోనే ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్‌ను కోట్ల మంది వీక్షించారు. ఇక ఫైనల్ అయితే ఆ రెస్పాన్స్ డబుల్‌గా ఉండేది.
మెల్బోర్న్ మైదానం కిక్కిరిసేది. భారత్‌లో బార్లు, రిసార్ట్లు కిటకిటలాడేవి. క్రికెట్‌ను మతంగా ప్రేమించే భారత్‌లో జనాలు ఆట కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఈ వీక్నెస్ను వ్యాపార సంస్థలు క్యాష్ చేసుకునే పనిలో ఉంటాయి. భారత్-పాక్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ను బిగ్ స్క్రీన్స్‌పై లైవ్ ఇచ్చి.. కోట్ల రూపాయలు సంపాదించారు. బార్లు, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన ఆదాయానికి లెక్కల్లేవ్.క్రికెట్ ఫీవర్‌ను క్యాష్ చేసుకోవడానికి బార్లు, రిసార్ట్లు సైతం స్పెషల్ ఆఫర్స్ ప్రకటించడం, బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేయడం సర్వసాధారణం.
కానీ భారత్ ఫైనల్ చేరకపోవడంతో జనాలు ఈ ఫైనల్‌ను లైట్ తీసుకుంటున్నారు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే వారు మాత్రమే ఈ మ్యాచ్‌ను వీక్షిస్తున్నారు. భారత్ ఫైనల్ చేరకపోవడం వల్ల అధికారిక బ్రాడ్‌కాస్టర్స్‌తో పాటు మీడియా, వెబ్‌సైట్స్, యూట్యూబ్ చానెళ్లు తమ ఆదాయాన్ని కోల్పోతున్నాయి. క్రికెట్‌తో దేశంలో వేల కోట్ల బిజినెస్ ముడిపడటమే దీనికి ప్రధాన కారణం. ఇంగ్లండ్-పాక్ ఫైనల్ మ్యాచ్‌ను హాట్‌స్టార్ 56 లక్షల మంది చూస్తున్నారు. అదే భారత్-పాక్ అయితే ఈ సంఖ్య మూడింతలుగా ఉండేది.
ఆ భయంతోనే ఫీల్డింగ్ ఎంచుకున్నా.
పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. ఇది చాలా పెద్ద మ్యాచని చెప్పిన బట్లర్.. తమ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని తెలిపాడు. ‘అభిమానులతో మైదానం కిక్కిరిసింది. ఇది తమకు కొత్త శక్తినిస్తుంది. ఈ మ్యాచ్‌ను గొప్పగా మార్చడంపై మేం ఫోకస్ పెట్టాం. అద్భుత ఫామ్‌తో రెండు జట్లు ఫైనల్ చేరాయి. ఈ సవాల్‌ను స్వీకరించేందుకు మేం సిద్దంగా ఉన్నాం.
ఇక టాస్ గెలిస్తే తాను కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. అయితే టాస్ అనేది మన చేతిలో లేదని, ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పాడు. ‘స్కోర్ బోర్డుపై భారీ లక్ష్యాన్ని ఉంచి ఇంగ్లండ్‌పై ఒత్తిడిని పెంచుతాం. మేం వరుస విజయాలతో జోరుమీదున్నాం. దాన్నే కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం.
ఆరంభంలో రెండు మ్యాచ్‌లు ఓడినా.. మే అద్భుతంగా పుంజుకున్నాం. ఫైనల్లో కూడా అదే స్పూర్తితో బరిలోకి దిగుతున్నాం. విజయం ఎప్పుడూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తోంది. జట్టుగా మేం 100 శాతం పోరాడుతాం. 1992 చరిత్ర రిపీట్ అయ్యింది. ఈ మ్యాచ్ కూడా గెలిచి కప్ అందుకుంటా. ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం’అని బాబర్ ఆజామ్ అన్నాడు.
స్టార్ ప్లేయర్‌కు విరిగిన కాలు.. భారత్‌లో సిరీస్‌కు కూడా కష్టమేనంటున్న డాక్టర్లు.
ప్రపంచ క్రికెట్లో గాయాల పర్వం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఒక జట్టు తర్వాత మరొక జట్టుకు సంబంధించిన స్టార్ ప్లేయర్ గాయాలతో కీలకమైన టోర్నీలకుద దూరం అవుతున్నారు.భారత్‌కు కూడా ఈ గాయాల బెడద వల్లే రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఈ ప్రపంచకప్‌లో ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజా ఆసీస్ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కాలు విరిగింది.స్నేహితుడి బర్త్ డే పార్టీకి వెళ్లిన మ్యాక్సీ.. తన ఫ్రెండ్‌తో కలిసి పరుగు తీస్తూ కింద పడ్డాడట. ఈ సమయంలో కాలుకు ఏదో తగలడంతో కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో అతని కాలు ఎముక విరిగిందని ఆస్ట్రేలియా సెలెక్టర్లు వెల్లడించారు. మ్యాక్సీ కాలుకు ఆపరేషన్ జరిగిందని, కాకపోతే ఎప్పుడు కోలుకుంటాడో అప్పుడే చెప్పలేమని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.
ఈ గాయం కారణంగా గురువారం నాడు మొదలయ్యే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆడటం లేదు. అలాగే గాయం తీవ్రతను చూస్తుంటే ఈసారి బిగ్ బ్యాష్ లీగ్ మొత్తానికి అతను దూరమయ్యేలా ఉన్నాడని వైద్యులు అంటున్నారు. ఈ గాయం నుంచి కోలుకోవడానికి మ్యాక్స్‌వెల్‌కు చాలా సమయం పడుతుందని చెప్పారు. దీంతో ఇంగ్లండ్ సిరీస్‌లో అతని స్థానాన్ని సీన్ ఆబాట్తో భర్తీ చేస్తున్నట్లు సెలెక్టర్లు తెలిపారు. తర్వాత కూడా మ్యాక్సీ కోలుకోకపోతే.. భారత్‌లో జరిగే టెస్టు సిరీస్‌లో కూడా అతను ఆడటం కష్టమేనట.
టీ20 ప్రపంచకప్ ముందు నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని జట్లను ఈ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. భారత్‌లో బుమ్రా, జడ్డూ గాయాలతో ఈ టోర్నీ ఆడలేదు. ఇంగ్లండ్‌లో జానీ బెయిర్‌స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాకే చెందిర జోష్ ఇంగ్లిస్ కూడా గోల్ఫ్ ఆడుతూనే గాయపడి ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. పాకిస్తాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిదీ కూడా ప్రపంచకప్ ముందు గాయపడి, టోర్నీ నాటికి ఎలాగో కోలుకున్న సంగతి తెలిసిందే.