Hyderabad: భాగ్య నగరవాసులకు అలర్ట్ … గచ్చిబౌలి నుంచి కొండాపూర్ రోడ్ బంద్ ఎప్పుడు వరకు అంటే ?
Hyderabad: భాగ్య నగరవాసులకు అలర్ట్ మూడు నెలల పాటు గచ్చిబౌలి టు కొండాపూర్ రోడ్ బంద్ చేస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్‌ను నిర్మిస్తున్న నేపథ్యంలో . ఈ నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు ఈ రోడ్ మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. గచ్చిబౌలి జంక్షన్ టు కొండాపూర్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. బుధవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీ హర్షవర్ధన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెలికాంనగర్ నుంచి కొండాపూర్‌కు వెళ్లాలంటే.. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని… శిల్పాలేఅవుట్ ఫ్లైఓవర్ నుంచి మీనాక్షి టవర్స్, డెలాయిట్, ఏఐజీ ఆసుపత్రి, క్యూమార్ట్, కొత్తగూడ మార్గంలో వెళ్లాలి. లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపునకు వెళ్లే వాహనాలను.. గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ నుంచి డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్, కొత్తగూడ మీదుగా మళ్లిస్తారు.
Also Watch
నానక్‌రాంగూడ విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ చౌరస్తా వైపునకు వెళ్లే వాహనదారులు.. ట్రిపుల్ ఐటీ కూడలి వద్ద ఎడమ వైపు వెళ్లి.. గచ్చిబౌలి స్టేడియం ముందు యూటర్న్ తీసుకుని డీఎల్‌ఎఫ్, రాడిసన్ హోటల్ మార్గంలో వెళ్లాలి.
టోలిచౌకి ప్రాంతం నుంచి ఆల్విన్ జంక్షన్‌కు వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని మైండ్‌స్పేస్, సైబర్ టవర్స్ జంక్షన్ మీదుగా హైటెక్స్ జంక్షన్ కొత్తగూడ, కొండాపూర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
గచ్చిబౌలి టెలికాంనగర్ నుంచి కొండాపూర్ వెళ్లాల్సిన వాహనాలు గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైవోవర్ కింద యూ టర్న్ తీసుకొని శిల్పా లేఅవుట్ ైఫ్లైవోవర్, మీనాక్షి టవర్స్, డిలైట్, ఏఐజీ దవాఖాన, క్యూమార్ట్ మీదుగా కొత్తగూడ, కొండాపూర్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.