HYD: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య…… మరో వారంలో రోజుల్లో పెళ్లి
HYD: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రతీ చిన్న దానికి, పెద్ద దానికి చాలా మంది యువత బలవన్మరణం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మరో వారంలో రోజుల్లోనే పెళ్లి ఉండగా ఓ మహిళా కానిస్టేబుల్, ఆత్మహత్యకు పాల్పడింది .
హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. రెండు రోజుల క్రితమే కానిస్టేబుల్ సురేఖకు నిశ్చితార్థం జరిగింది. ఇష్టంలేని పెళ్లి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. అయితే ఇన్‌స్పెక్టర్ జి.కిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైతారం గ్రామానికి చెందిన డి.పర్వతాలు కూతురు డి.సురేఖ (28), 2018 బ్యాచ్ కానిస్టేబుల్. ప్రస్తుతం అలియాబాద్ కల్వగడ్డ బస్తీలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటూ ఛత్రినాక పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నది. ఈ నెల 1వ తేదీన పెద్దల సమక్షంలో జైతారం గ్రామంలో తల్లిదండ్రులు సురేఖకు పెళ్లి చేయడానికి బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. 2వ తేదీన తిరిగి నగరానికి వచ్చారు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు ఎవరి పనులపై వారు బయటకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సురేఖ ఉదయం 11 గంటల సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. సమాచారం అందుకొన్నశాలిబండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరి సురేఖ బలవన్మరణానికి పాల్పడటంతో తోటి ఉద్యోగస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది.సురేఖ కుటుంబస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేతికొచ్చిన కూతురు మరణించడంతో తోబుట్టువులు రోధిస్తున్నారు.బాధ్యత గల పదవిలో ఉద్యోగం చేస్తున్న యువతి ఇటువంటి చిన్న విషయానికి మరణించడంతో సురేఖ ఇంటి వద్ద చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు.
ఒక మంచి ఉద్యోగంలో ఉండి కూడ ఇష్టం లేని పెళ్లి చేసుకునే దాకా నిశ్చితార్థం దాకా పరిస్థితి వెళ్లకుండా ముందుగానే తల్లిదండ్రులను ఒప్పించాల్సి ఉండాల్సిందని తల్లిదండ్రులు అర్థం చేసుకుని ఉండాల్సిందే అంటున్నారు.ఈ రకంగా ప్రాణాలు తీసుకోకుండా ఉంటే బాగుండేదని అందరూ అభిప్రాయపడుతున్నారు.