Holidays: ఏపీ,తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

Holidays

ఏపీ,తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్

Holidays: హాలిడేస్ అంటే అందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. స్కూల్ పిల్లలు అయితే హాలిడే ప్రకటించిన వెంటనే ఎగిరి మరీ గంతేస్తారు. ఇది వారికి ఎందో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ , ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు హాలిడేస్ వచ్చేశాయి. ఇక ఏపీలో పాఠశాలలకు కూడా Holidays ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురు చూస్తున్నారు విద్యార్థులు

ఏపీ విద్యార్దులకు ఏప్రిల్ 27తో విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి. రెండు రోజులు అనంతరం ఫలితాల వెల్లడించి పేరెంట్స్ మీటింగ్ మొదలైనవి కంప్లీట్ చేసేస్తారు. వాటి తర్వాత సెలవులు ప్రకటించే ఛాన్స్ ఉంది.

మరొక వైపు తెలంగాణలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్ల  వేసవి Holidays ను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వ‌ర‌కు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని వెల్లడించింది.  అయితే జూన్ 11తో సమ్మర్ సెలవులు ముగియనుండగా జూన్ 12న పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి 2023-24కు సంబంధించిన కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్ ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ స్కూళ్లకు కూడా ప్రభుత్వం ప్రకటించిన వేసవి సెలవులు అమలు కానున్నాయి. ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ నెల 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు సమ్మర్ హాలిడేస్ ఉండనుండగా జూన్ 12న రీ ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే స్కూల్ విద్యార్థులకు పరీక్షలు ముగియగా ఈ విద్యాసంవత్సరానికి 24వ తేదీని చివరి పనిదినంగా ప్రకటించారు. సోమవారం అన్ని స్కూళ్లల్లో పేరేంట్స్ మీటింగ్స్ నిర్వహించనున్నారు.

ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల అడ్మిషన్స్ పెంచేందుకు జూన్ 1 నుంచి బడి బాట కార్యక్రమాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నిర్వహించనుంది. గవర్నమెంట్ టీచర్లు తమ స్కూళ్లలో విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వనున్నారు. అలాగే వేసవి సెలవుల్లో మన ఊరు-మన బడి కార్యక్రమం పనులను పూర్తి చేసేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు ఇచ్చే యూనిఫాంలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల తరహాలో కొత్త కార్పొరేట్ స్ట్రైల్ వచ్చేలా యూనిఫాంలను డిజైన్ చేయించనున్నారు. ఫ్యాషన్ డిజైనర్ల సూచనల మేరకు మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh