Helicopter :అపాచీ హెలికాప్టర్‌కు తృటి తప్పిన ప్రమాదం
Helicopter : ఇటీవలి కాలంలో వాయుసేనలో ఉపయోగిస్తున్న హెలికాఫ్టర్లు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. అలాంటి ఘటన ఒకటి ఈ రోజు భారత వాయుసేనకు చెందిన ఓ అపాచీ అటాక్ హెలికాప్టర్ మధ్యప్రదేశ్‌లోని భింధ్ వద్ద అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే దీనిని పొలాల్లో అత్యవసర ల్యాండ్ చేశాడు. పైలట్ అప్రమత్తతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. సాంకేతిక లోపాన్ని Helicopter : సరిచేసి మళ్లీ గమ్యస్థానానికి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే దీనికి సాయం చేసేందుకు మరో హెలికాప్టర్‌ను అక్కడికి పంపారు. సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఐఎఎఫ్ అపాచీ ఎహెచ్ -64 హెలికాఫ్టర్ భింద్ సమీపంలో అత్యవసరంగా సమీప పొలాల్లో ల్యాండ్ అయిందని వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది. సిబ్బంది మరియు విమానం అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొంది.
అయితే పొలాల్లో దిగిన హెలికాఫ్టర్ ను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ నెల ప్రారంభంలో ధ్రువ్ హెలికాఫ్టర్ జమ్మూకశ్మీర్ లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా Helicopter : హెలికాఫ్టర్ కుప్పకూలింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సాంకేతిక నిపుణుడు పబ్బల్ల అనిల్ అక్కడికక్కడే చనిపోయారు. పైలట్లు ఇద్దరూ గాయపడ్డారు. మార్చిలో అరుణాచల్ ప్రదేశ్ లో ఆర్మీ హెలికాఫ్టర్ ఒకటి కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
#WATCH | An Apache attack helicopter today made a precautionary landing in a field in a village in the Bhind district of Madhya Pradesh.
Visuals of the Apache helicopter and another chopper arriving to provide assistance to the Apache. https://t.co/hCfvqcw14S pic.twitter.com/1aEpBZEt8w
— ANI (@ANI) May 29, 2023