ఈ బ్రేక్‌ఫాస్ట్ చేస్తే బరువు తగ్గడమే కాదు..గుండె సమస్యలు కూడా రావట..
ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదని చెబుతున్నారు నిపుణులు.
రోజూ మనం తీసుకునే ఆహారంలో Key Role పోషించేది బ్రేక్‌ఫాస్టే. రోజుని ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రారంభించాలంటే ఉదయాన్నే మంచి పోషకమైన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. అదే విధంగా, ప్రతి రోజూ బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల కలిగే మరో ముఖ్య లాభం ఏంటంటే.. శరీర బరువు అదుపులో ఉంటుంది.బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మన Body చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
దీంతో పాటు.. మెదడు చురుగ్గా పనిచేసేందుకు కూడా బ్రేక్ ఫాస్ట్ హెల్ప్ చేస్తుంది.. మనం తీసుకునే ఆహారం వల్లే మెదడుకి గ్లూకోజ్ అందుతుంది.. అప్పుడే మనం ఏ పనైనా సరిగ్గా చేయగలం.. మనం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే మెదడు చురుగ్గా పనిచేయదు. చేసే పని పట్ల ఆసక్తి తగ్గుతుంది. మతిమరుపు వంటి సమస్యలు కూడా రావు.
బ్రేక్ ఫాస్ట్ సరిగ్గా చేస్తే షుగర్ వ్యాధి రాదని చెబుతున్నారు నిపుణులు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని చెబుతున్నారు.
ఊడిన చోట జుట్టు మళ్లీ రావాలంటే.. ఈ గింజలను తింటే సరి..
తమ జుట్టు నల్లగా, ఒత్తుగా ఉండాలని కోరుకోనివారుండరు. జుట్టును అందంగా ఉంచుకోవడానికి మనం చేయని ప్రయత్నం అంటూ కూడా ఉండదు. కానీ ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం, బట్టతల వంటి సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఇక జుట్టు బాగా రావాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాల్లో సోయాబీన్స్ ఒకటి. ఈ సోయాబీన్స్‌ను 12గంటల పాటు నానబెట్టి మనం రోజూ తయారు చేసే వంటల్లో వేసి తీసుకోవచ్చు. అలాగే మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ లభిస్తాయి. తగినన్ని ప్రోటీన్స్ అందడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు కూడా వస్తుంది.
మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సోయా బీన్స్ ను తినలేని వారు ఈ మొలకెత్తిన విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్స్ తో పాటు ఇతర పోషకాలు కూడా మనకు లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గడంతో పాటు రాలిన జుట్టు స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి. ఈ విధంగా ప్రతిరోజూ తలస్నానం చేస్తూ, మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కీరదోసతో అద్భుతమైన ఉపయోగాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు
నిజానికి కీరదోసతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతో పాటు ఖనిజలవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ-హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణ భర్తీ చేయడానికి కీరదోస ముక్కలు తినడం శ్రేయస్కారం.
కీరదోసలో పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థను శుభ్రపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని నివారిస్తుంది.
కీరదోసలో మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే చర్మ సౌందర్యం కోసం కూడా వాడుతుంటారు.
కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ముఖ్యంగా ఇది మహిళల్లో రొమ్ముక్యాన్సర్లను, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్లను నివారిస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంచేలా చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది.