Gujarat VS India : నేడు తలపడనున్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్

Gujarat VS India

Gujarat VS India నేడు తలపడనున్న ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్

Gujarat VS India  ముంబై ఇండియన్స్ తో వాంఖెడే వేదికగా  గుజరాత్ టైటాన్స్  తలపడుతున్న మ్యాచ్ లో ఆ రెండు జట్లతో పాటు ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పలు జట్ల భవితవ్యాన్ని తేల్చనుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న  నేటి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్  టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్  తొలుత  బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ బెర్త్‌ దాదాపు ఖరారు చేసుకున్న గుజరాత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేస్ ఫిక్స్ చేసుకుంటుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లో గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది.

అటు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విన్ అయితే.. ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరగవుతాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. అయితే  నేటి మ్యాచ్ లో గెలిస్తే ఆ జట్టు టాప్ -3కి చేరడంతో పాటు  ప్లేఆఫ్స్ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.

Gujarat VS India  కానీ వాంఖెడేలో ఫలితం ముంబైకి వ్యతిరేకంగా వస్తే మాత్రం అది మొదటికే మోసం. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న లక్నో (11 పాయింట్లు), ఆర్సీబీ (10 పాయింట్లు),  పంజాబ్ (10 పాయింట్లు)  లు   ముంబై ఓడాలని కోరుకుంటున్నాయి. ముంబై గెలిస్తే ఆ తర్వాత  ఆ జట్టు ఆడే రెండు మ్యాచ్ లలో ఒక్కటి గెలిచినా   ఆ జట్టుకే   ప్లేఆఫ్స్ అవకాశాలుంటాయి.  కానీ ముంబై ఓడితే మాత్రం.. పైన పేర్కొన్న మూడు జట్లకు   (ఈ మూడింటికీ ఇంకా మూడు మ్యాచ్ లు ఆడే అవకాశం ఉంది.

Gujarat VS India దాంతో  మూడు గెలిచినా  ఆరు పాయింట్లు (మొత్తంగా 16 పాయింట్లు  ఖాతాలో వేసుకుంటే నెట్ రన్ రేట్ బాగున్న జట్లకు  ప్లేఆఫ్స్ ఛాన్సెస్ ఉంటాయి) దక్కించుకోవచ్చు.   నేడు (శుక్రవారం) రాత్రి ముంబై సొంత మైదానం వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే ముంబై వాంఖడే స్టేడియ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండడంతో బ్యాట్స్‌మెన్లు పండగ చేసుకుంటారు. మరోసారి బౌండరీల వరదపారే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు కూడా ఆరంభంలో మంచి సహకారం లభిస్తుంది. ఈ మ్యాచ్‌ కూడా హైస్కోరింగ్ గేమ్‌గా జరిగే ఛాన్స్ ఉంది.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, కెమెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మాండ్వాల్, క్రిస్ జోర్డాన్.

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh