Gujarat Titans : భారీ ఉత్కంఠతో సాగిన క్వాలిఫైయర్ -2 లో ఘన విజయంతో ఫైనల్ కు చేరిన గుజరాత్ టైటాన్స్
Gujarat Titans : అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లోగుజరాత్ టైటాన్స్ విజృంభించింది.
క్వాలిఫైయర్ -2 పోరులో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై
ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచులో 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్
చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు
ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది.
గుజరాత్ స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు వదిలేయడం ముంబై ఇండియన్స్ జట్టు
భారీ మూల్యం చెల్లించుకుంది. అక్కడి నుంచి శుభమన్ గిల్ రెచ్చిపోయాడు. మొదటి 50 పరుగుల్ని
32 బంతుల్లో పూర్తి చేసిన గిల్, ఆ తరువాత 50 పరుగుల్ని కేవలం 17 బంతుల్లో పూర్తి చేశాడు.
అంటే కేవలం 49 బంతుల్లో Gujarat Titans : సెంచరీ సాధించేశాడు.
అ తరువాత 234 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.
ముందు వధేరా, రోహిత్ శర్మ వికెట్లు వెనువెంటనే పడిపోయాయి. గ్రీన్ గాయపడి వెనుతిరిగాడు.
ఇక తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబైలో ఆశలు చిగురింపజేయడమే కాకుండా కచ్చితంగా గెలిపిస్తాడనే
నమ్మకం కల్గించాడు. కేవలం 14 బంతుల్లో 43 పరుగులు చేసి..రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో
ముంబై నిరాశకు లోనైంది. షమీ బౌలింగ్‌లో ఒక ఓవర్లో ఏకంగా నాలుగు వరుస ఫోర్లు , ఒక సిక్సర్ కొట్టడం విశేషం.
తిలక్ వర్మ తరువాత సూర్య కుమార్ యాదవ్, తిరిగి క్రీజ్‌లో వచ్చిన గ్రీన్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
అంతలోనే గ్రీన్ ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ అవుట్ కావడంతో ఇక అంతా ముగిసిపోయింది.
సూర్యకుమార్ యాదవ్ అవుట్ తరువాత వికెట్లు ఒకదానివెంట ఒకటిగా పడిపోయాయి.
దాంతో 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలవుట్ అయింది. గుజరాత్ బౌలర్లలో Gujarat Titans : మోహిత్
శర్మ 5 వికెట్లు తీసి గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీనితో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది.
ఆదివారం చైన్నై, గుజరాత్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.