యశోద’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కానుందని పేర్కొంది . యశోద’ సినిమా ను ఓటీటీలో విడుదల చేయకూడదని హైదరాబాద్‌లోని ఓ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.ఎందుకంటే హైదరాబాద్, వరంగల్‌లో ‘ఈవా ఐవీఎఫ్’ పేరుతో హాస్పిటల్స్ ఉన్నాయి. ‘యశోద’ లో ‘ఈవా’ పేరు ఉపయోగించడం వల్ల తమ హాస్పిటల్స్ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతోందని ఆస్పత్రి వర్గాలు కోర్టులో కేసు వేశాయి. ఆ విషయం తెలిసిన వెంటనే వాళ్ళతో ‘యశోద’ చిత్ర నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చర్చలు జరిపారు. యశోద’లో ‘ఈవా’ పేరును తొలగించాలని శివలెంక కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆ నిర్ణయంతో ‘ఈవా ఐవీఎఫ్’ ఆస్పత్రి ఎండీ మోహన్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆ విషయం కోర్టుకు చెప్పడంతో ..కోర్ట్ కేసు కొట్టేశారు.అందుకే ఇప్పుడు OTT విడుదలకు మార్గం సుగమం అయింది ..యశోద ‘ విడుదలకు ముందు సమంత ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఒక్కో రోజు అడుగు తీసి, అడుగు వేయడం కష్టమైయ్యేది . సెలైన్ బాటిల్ సహాయంతో డబ్బింగ్ చెప్పారు. మొత్తానికి ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది.యశోద’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణమైన దర్శక – నిర్మాతలకు, సహ నటీనటులకు కూడా సమంత థాంక్స్ చెప్పారు. ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశారు. వాళ్ళకు థాంక్స్. వరలక్ష్మీ శరత్ కుమార్ గారికి, ఉన్ని ముకుందన్ గారికి, మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరితో పనిచేయడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది” అని సమంత తెలిపారు.యశోద’ సక్సెస్ మీట్లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. ”యశోద 2′ విషయంలో మాకు ఓ ఐడియా ఉంది. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు… థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా రెడీగా ఉంది” అని దర్శకులు తెలిపారు. అయితే… సీక్వెల్స్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేది ఇంకా సమంత చేతుల్లో ఉందని, ఆమె నిర్ణయంపై అంతా ఆధారపడి ఉందని చెప్పారు.