AP Government: ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
AP Government: ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలున్న నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారంతో వైఎస్ జగన్ అప్రమత్తమవుతున్నారు. ఉద్యోగులకు ఇవాల్సిన ప్రయోజనాలపై ఇప్పటికే వారి నుంచి వివరాలు తీసుకున్న ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే సమయంలో వారి ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించి మరో కీలక ఉత్తర్వు జారీ చేసింది.
దీంతో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న మరో సమస్య తీరినట్లయింది. ఏపీలో ఉద్యోగులకు AP Government ఈహెచ్ఎస్ పేరుతో ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు అవసరమయ్యే మొత్తాన్ని ఆస్పత్రులకు సమకూరుస్తోంది. ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే ఈహెచ్ఎస్ పథకం ద్వారా వారికి ఉచితంగా ఆస్పత్రులు చికిత్స అందించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. అలా చికిత్స ఇచ్చేందుకు వీలుగా ఈహెచ్ఎస్ పథకంలో వివిధ రకాల చికిత్సలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాల్సి ఉంది. కానీ అలా జరగడం లేదు. దీంతో ఉద్యోగులకు ఆస్పత్రుల్లో సమస్యలు తప్పడం లేదు.
అయితే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లోకి కొత్తగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలని శాశ్వతంగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు రిలీజ్ చేసింది. అంటే వీటిని ప్రతి ఏటా రెన్యూవల్ చేయాల్సిన పని కూడా ఉండదు. మెడికల్ ఆంకాలజీలో 32, సర్జికల్ ఆంకాలజీలో 10, రేడియేషన్ ఆంకాలజీలో 4 చికిత్సలను ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో శాశ్వతంగా చేర్చింది ప్రభుత్వం. దీంతో AP Government ఉద్యోగ సంఘాలు సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పాయి. ఈ చికిత్సలు ప్రజంట్.. సర్వీస్‌లో ఉన్న ఎంప్లాయిస్‌తో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకి సైతం అనుబంధ హాస్పిటల్స్‌లో అందేలా చూడాలని సీఎం జగన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు సూచించారు.
దీంతో ఉద్యోగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు. ఇప్పటికే AP Government ఉద్యోగులు ఈహెచ్ఎస్ విషయంలో పలు మార్లు చర్చల్లో ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
అటు పేదలకు వర్తించే ఆరోగ్యశ్రీ సేవల్లోను కీలక మార్పులు చేసింది ప్రభుత్వం వేల సంఖ్యలో కొత్త వ్యాధులను చేర్చింది. రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది.