Gandhi Family: వచ్చే నెలలో తెలంగాణకు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ
Gandhi Family: తెలంగాణలోఈ ఏడాది ఎన్నికలు వున్నా నేపద్యంలో ఇక్కడ రాజకీయ పార్టీల ప్రజల మధ్యకు పోటా పోటీ గా ముందుకు దూసుకుని వెల్లుతున్నాయి.ఒక వైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇక తామేమి తక్కువ కాదని కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు ఇటీవల సరూర్ నగర్ సభతో ఎన్నికల శంఖారావం పూరించిందనే చెప్పుకోవాలి. అంతేకాదు యువతే లక్ష్యంగా ప్రియాంక గాంధీ ‘యూత్ డిక్లరేషన్’ ను ప్రకటించారు. ఇక ఈ యువ సంఘర్షణ సభతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే ఊపును కొనసాగించాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అనేక వ్యూహాలను సిద్ధం చేసినట్లు సమాచారం.
అయితే జూన్ మొదటివారంలో హైదరాబాద్‌కు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్, ప్రియాంక గాంధీ. బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్ భవనానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అదే రోజున 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ అందజేయనున్నారు కాంగ్రెస్ నేతలు.
Also Watch
జూన్ మొదటివారంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ రానుండడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పర్యటనలో వారు ఏమైనా హామీలు ఇస్తారా? తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి ఆ అంశాన్ని ఏ విధంగా తీసుకెళ్తారు? ఈ పర్యటన ద్వారా అధికారికంగా ఎన్నికల శంఖారావం పూరించనున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల నెలకొన్న పరిణామాల నేపథ్యంలో వీరి పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.
అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌లో వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దొంగిలిస్తోందని ఆరోపించారు. ఇది నియమ నిబంధనలకు విరుద్ధమని రేవంత్ పేర్కొన్నారు. వర్షాకాలంలో కంటోన్మెంట్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బోర్డు సమావేశంలో చర్చించామని ఆయన తెలిపారు. మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్యే సాయన్న విగ్రహాలను కంటోన్మెంట్‌లో ఏర్పాటు చేయాలని కోరామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్‌కు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో విడుదల చేయడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు .