సౌత్ స్టార్ హీరో విజయ్‌తో ఫొటో దిగే సమయంలో ఓ విద్యార్థిని చేసిన పని నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ ఆమె భుజంపై చేయి పెట్టగానే… ఆ విద్యార్థిని ఆ చేయిని తొలగించింది. ఈ సంఘటన ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కానీ దీని వెనుక అసలైన విషయం ఏంటంటే…
చెన్నైలో తమిళ వెట్రి కజగం పార్టీ వార్షిక వేడుకలో విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి, 12వ తరగతుల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు విద్యార్థినులకు విజయ్ బహుమతులు అందజేశారు. ఆ తర్వాత వారితో కలిసి ఫొటోలు దిగారు.
Moment when a student showed the real place to Crypto Vijay pic.twitter.com/emeGx7sl8g
— Flt Lt Anoop Verma (Retd.) 🇮🇳 (@FltLtAnoopVerma) April 21, 2025
అయితే ఫొటో దిగే సమయంలో విజయ్ ఆ విద్యార్థిని భుజంపై చేయి పెట్టగా… ఆమె ఆ చేయిని తన భుజం పై నుంచి తీసేసింది. ఈ వీడియో క్లీప్ నెట్టింట్లో వైరల్ కావడంతో, విజయ్ అభిమానుల్లో కొంతమంది తీవ్రంగా స్పందించారు. ఆ విద్యార్థిని తీరుపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
అయితే ఈ ఘటనపై పూర్తి వీడియో బయటకు రాగానే అసలు విషయం తేలింది. విజయ్ చేయిని అవమానంగా తీసివేయడం కాదు… ఆమె స్వయంగా ఆ చేయిని పట్టుకొని, కాస్త కరెక్ట్ చేసుకొని, ఫొటోకు సెట్ అయ్యిందట.
9k half baked peoples liked this 🤡
Original Video is here .
எங்கள உங்களால ஒன்னும் செய்ய முடியாது ப்ரோ.#தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/x2wIg66GkA— 𝕵𝖔𝖍𝖓 𝕵𝕽™ (@vetrimaran_of) April 21, 2025
గత ఏడాది జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మళ్లీ బయటకు రావడంతో, వాస్తవాలు తెలిసి చాలా మంది నెటిజన్లు స్పందన మారుస్తున్నారు. చిన్న క్లిప్ చూసి తక్షణమే అభిప్రాయం ఏర్పరచుకోవడం ఎంత తప్పో ఈ ఉదంతం మరోసారి రుజువు చేసింది.