Upasana: మెగా కోడలి గొప్ప మనసు.. 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్న ఉపాసన..!

మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల మరోసారి గొప్ప మనసును చాటుకుంది. ఓవైపు అపోలో ఆస్పత్రుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తోంది.

150 వృద్ధాశ్రమాల దత్తత
అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్‌ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న ఉపాసన తాజాగా ఏకంగా 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుంది. ఇకపై ఈ వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు వైద్యసదుపాయాలు, పోషకాహారం, ఎమోషనల్ సపోర్ట్ కల్పించేందుకు తన వంతు కృషి చేయనుంది. అధికారిక ప్రకటన ఎక్కడా విడుదల కాకపోయినా, ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు “మెగా కోడలి గొప్ప మనసు అందరికీ స్ఫూర్తి” అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

రామ్ చరణ్ సినిమా అప్‌డేట్
ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నాయి.

Leave a Reply