షాహిద్ కపూర్ తెలుగు తెరకు పరిచయం చేయునున్న దిల్ రాజు

Shahid Kapoor: షాహిద్ కపూర్ తెలుగు తెరకు పరిచయం చేయునున్న దిల్ రాజు

భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇక ఆర్ ఆర్ ఆర్  త‌రువాత ఆ క్రేజ్ మ‌రింత పెరిగింది. బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. అక్కడి వారు ఇక్క‌డ‌ సినిమాల‌ను అక్క‌డ రీమేక్ చేస్త‌న్నారు. స్టార్ హీరోలు సైతం తెలుగు మూవీ రీమేక్‌ల‌లో న‌టించేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు.

అలాగే మ‌న టాలీవుడ్ ద‌ర్శ‌కులు కూడా చాలా మంది అక్క‌డికి వెళ్లి స‌క్సెస్ కొడుతున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న షాహిద్ క‌పూర్ టాలీవుడ్ ద‌ర్శ‌కులే కావాలనుకుంటున్నాడు. అక్క‌డి వారిని ప‌క్క‌న‌పెట్టి మ‌రీ ఇక్క‌డి వారిని ఎంచుకున్నాడు. మూడేళ్ల క్రితం ప‌ద్మావ‌త్ వంటి భారీ విజ‌యం సాధించిన మూవీలో న‌టించిన‌ప్ప‌టికీ ఆ స‌క్సెస్ ర‌ణ్‌వీర్ సింగ్, దీపికా ఖాతాలోకి ప‌డింది.

అయితే దీంతో షాహిద్ క‌న్ను తెలుగు చిత్రాల‌పై ప‌డింది.షాహిద్ కపూర్ ఎప్పుడూ తన సినిమా ఎంపికలతో అభిమానులను ఆకట్టుకునే నటుడు. బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు దక్షిణాది నుంచి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రేమపై కన్నేశాడు. ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమాను ఆస్కార్ కు తీసుకెళ్లిన తర్వాత చాలా మంది బాలీవుడ్ హీరోలు దక్షిణాదికి చెందిన దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే దక్షిణాదిన తమదైన ముద్ర వేసిన అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, అజయ్ దేవగణ్, సునీల్ శెట్టి, వివేక్ ఒబెరాయ్ వంటి నటుల జాబితాలో షాహిద్ కపూర్ కూడా చేరినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

తాజాగా  బాలీవుడ్ లైఫ్ రిపోర్ట్ ప్రకారం షాహిద్ కపూర్ తెలుగు నిర్మాత దిల్ రాజుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. హిందీలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి షాహిద్ కపూర్ తో దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు  వార్తలు`వినిపిస్తున్నాయి.

అసలే  అభిమానులు తెలుగు సినిమా కోసం ఆశపడుతుంటే, ఆ దర్శకుడు మాత్రం హిందీ సినిమా తీయాలనుకుంటాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ప్రాజెక్ట్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే దీనిపై ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం  చాలా భాషల్లో బిజీగా ఉన్న ఓ ప్ర ముఖ క థానాయికను హీరోయిన్ గా న టించడానికి  పిక్స్ చేస్తున్నట్టు సమాచారం. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ఓటీటీ తొలి వెబ్ సిరీస్ ఫర్జీతో షాహిద్ తన కెరీర్ ఒక ఊపునిసచ్చడు .  అయితే గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమ నిరాశపరిచే సినిమాలు తీస్తోందని అన్నారు.

“గత 3-4 సంవత్సరాలలో ఒక సమాజంగా, చిత్ర పరిశ్రమ చేసిన కొన్ని ఎంపికలు మంచివి కావని నేను అనుకుంటున్నాను, కాబట్టి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి మరియు ప్రేక్షకులు ఎలా అనుభూతి చెందుతున్నారు మరియు వారిని ఎలా సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంచాలి అనే దానిపై మరింత అవగాహనతో బలమైన, మెరుగైన, స్పష్టమైన ఎంపికలు చేయడానికి మనమందరం కలిసి రావాలి.

Leave a Reply