విశాల్‌కు షాక్‌ ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు అప్పటి వరకు విశాల్  సినిమాలపై నిషేధం!

VISHAL:విశాల్‌కు షాక్‌ ఇచ్చిన మద్రాస్‌ హైకోర్టు అప్పటి వరకు విశాల్  సినిమాలపై

నిషేధం!

విశాల్ తెలుగు తమిళ భాషల్లో సమానంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో. విశాల్ ని తెలుగు ప్రేక్షకులు ఇక్కడి నటుడిగానే ప్రేమ కురిపిస్తారు. తెలుగు రాష్ట్రాలతో విశాల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. విశాల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏపీలోనే మొదలయింది. సినిమాలతో పాటు ఇతర వ్యవహారాలు, వివాదాలతో కూడా నిత్యం విశాల్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. స్టార్‌ హీరో విశాల్‌కు మద్రాస్‌ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది.

అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్‌ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్‌ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్‌ అన్బుచెళియన్‌ వద్ద రూ. 21కోట్లు అప్పు తీసుకున్నాడు.

అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్‌ ఫైనాన్షియర్‌కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్‌ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ – లైకా ప్రొడక్షన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జ్‌ స్పెషల్‌ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి స్పెషల్‌ కోర్టు రిజిస్ట్రార్‌ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్‌ చేయాలని ఆదేశించింది.

ఈ కేసు విచారణ సమయంలో విశాల్‌ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్‌ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్‌ చేస్తూ విశాల్‌ హైకోర్టులో అప్పీల్‌ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజా, జస్టిస్‌ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్‌ చెల్లించాలంటూ సింగిల్‌ స్పెషల్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్‌ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది. దీనితో విశాల్ పెద్ద ఆర్థిక సమస్యల్లోనే పడ్డాడు. విశాల్ తన నిర్మాణ సంస్థలో పలు చిత్రాలు నిర్మిస్తున్నాడు. దీనిపై విశాల్ తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతోందో మరి.

 

Leave a Reply