బేబీ బంప్ తో ఉపాసన ఫోటోలు వైరల్

Upasana: సరోగసీ వివాదానికి చెక్ పెట్టిన మెగా కోడలు

మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త్వ‌ర‌లోనే త‌ల్లిదండ్రులం కాబోతున్నామంటూ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆమెపై ఏ విధంగా వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ముఖ్యంగా ఆమె కూడా సరొగసీ విధానాన్నే ఎంచుకుందా? అనేలా కొందరు లేని పోని వార్తలను వైరల్ చేశారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి గుడ్ న్యూస్ వచ్చి చాలా కాలం అవుతుంది. కానీ ఉపాసన మాత్రం నార్మల్‌గానే కనిపిస్తూ అమెరికా, ఢిల్లీ అంటూ అటు, ఇటు తిరిగేస్తుందనేలా ఆమె గురించి రాసుకొచ్చారు.

ఇలా రూమర్స్‌ను క్రియేట్ చేస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారందరికీ రామ్ చరణ్ బర్త్ డే పార్టీ వేడుక కనువిప్పుగా మారింది. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత ఉపాసన, రామ్ చరణ్ దంపతులు  మెగాస్టార్ చిరంజీవి కి, మెగా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పారు.  అయితే ఆ ఆనందం అనుభవించే లోపే సరొగసి అంటూ కొందరు పుట్టించిన వార్తలు సరోగసీ వివాద వార్త‌ల‌కు ఇటు రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న కొణిదెల దంప‌తులు కానీ అటు మెగా క్యాంప్ కానీ ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. మెగా ఫ్యామిలీ మాత్రం  సైలెంట్‌గా ఉంటూ వ‌చ్చారు. అయితే కొన్నిసార్లు మాట‌లు కంటే చేత‌లు చాలా బ‌లంగా ఉంటాయి.

అలాంటి పనులు చేస్తే చాలు అవి చూడగానే విమ‌ర్శ‌లు చేసిన వారిని ఆటోమేటిక్‌గా నోళ్లు మూత పడతాయి. అలాంటి ప‌నే ఇప్పడు ఉపాస‌న కొణిదెల చేసింది. ఇంత‌కీ మెగా కోడలు ఏం చేసిందో తెలుసా!మెగా ఫ్యామిలీని ఇబ్బందికి గురిచేసినా వారు మాత్రం ఎక్కడా ఆ రూమర్స్‌పై పెదవి విప్పలేదు. అసలు విషయం వారికి తెలుసు కాబట్టి ఇలాంటి వ్యక్తిగత విషయాలపై స్పందించాల్సిన అవసరం లేదు కాబట్టి మెగా ఫ్యామిలీ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

స‌రోగ‌సీ ద్వారా ఉపాస‌న పిల్ల‌ల్ని క‌న‌బోతుందంటూ నెట్టింట వైర‌ల్ అయిన వార్త‌ల‌కు ఓ కార‌ణ‌ముంది. కార‌ణం ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల్లో ఎక్కువ మంది స‌రోగ‌సీ ద్వారా పిల్ల‌ల్ని క‌న‌టం. ఇలాంటి నేప‌థ్యంలో అపోలో హాస్పిట‌ల్స్ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉపాస‌న క‌చ్చితంగా స‌రోగ‌సీ ద్వారానే పిల్ల‌ల్ని కంటుంద‌ని చాలా మంది భావించారు. కానీ అలాంటి వాటికి మెగా కోడ‌లు ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఏదైతేనేం ఎట్ట‌కేల‌కు ఉపాస‌న స‌రోగ‌సీ వివాదానికి చాలా తెలివిగా ముగింపు ఇచ్చింది.

రూమర్స్‌పై రామ్ చరణ్, ఉపాసన దంపతులు క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఉపాసన తన బేబీ బంప్ ఎక్స్‌పోజ్ అవ్వకుండా జాగ్రత్త పడుతూ లూజైన అవుట్ ఫిట్స్‌తో కవర్ చేస్తూ వచ్చింది. కానీ సోమవారం రాత్రి జరిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే పార్టీలో బేబీ బంప్ కనిపించేలా ఉపాసన టైట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది.

రామ్ చరణ్‌తో కలిసి ఉపాసన ఇలా కనిపించిన ఫొటోలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన తర్వాత అనుమానాలు వ్యక్తం చేసిన వారందరి నోళ్లు మూగబోతే మెగా ఫ్యాన్స్ మాత్రం యమా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్, మెగా పవర్ స్టార్ తమ వారసుడిని ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తారా? అని వారు ఎంతో ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు.

Leave a Reply