పుష్ప-2 లో అల్లు అర్జున్‌ లుక్‌పై మెగాస్టార్  ట్వీట్‌

megastar Chiranjivi :పుష్ప-2 లో అల్లు అర్జున్‌ లుక్‌పై మెగాస్టార్  ట్వీట్‌

మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఐకాన్‌ స్టార్‌గా క్రేజ్‌ దక్కించుకున్నాడు అల్లు అర్జున్‌. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ఇండియా స్థాయిలో పాపులారిటీ సంపాదించుకొని నేషనల్‌ స్టార్‌గా ఎదిగాడు.నేడు(శనివారం) అల్లు అర్జున్‌ 41వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి బన్నీకి పెద్దె ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ నుంచి అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7 వ తేదీన ఒక చిన్న టీజర్ లా సినిమా నిర్వాహకులు విడుదల చేశారు. ఆ టీజర్ అప్పుడే వైరల్ అవుతోంది కూడా. ఇందులో ‘పుష్ప ఎక్కడ’ అన్న కాన్సెప్ట్ తో తీసిన టీజర్ అది. చివరికి పుష్ప కనిపించి ఇంక పుష్ప గాడి రూల్ మొదలయింది అనేట్టుగా చెప్పారు. దర్శకుడు సుకుమార్ ఈ టీజర్ లో బాగా హైప్ చూపించాడు పుష్ప కోసం. ఎటు పోయాడు, ఎక్కడికి పోయాడు, బుల్లెట్స్ తగిలి చనిపోయాడా, ఎక్కడ పుష్ప అన్న విషయాన్ని బాగా హైప్ చేయగలిగాడు. అలాగే పుష్ప అనేవాడు డబ్బు ఎలా సంపాదించాడు అని కాదు, సంపాదించినా డబ్బును ఏమి చేసాడు అనే విషయం కూడా చూపించాడు సుకుమార్. అయితే.. ఈ నేపథ్యంలో ఓ పోస్టర్‌ ను కూడా ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌.

ఈ పోస్టర్ ను మెచ్చుకుంటూనే బన్నీకి విషేష్‌ చెప్పాడు.  తన మేనమామ, మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా వేదికగా బన్నీకి బర్త్‌డే విషెస్‌ను తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే డియర్‌ బన్నీ పుష్ప-2 ది రూల్‌ ఫస్ట్‌ లుక్‌ రాకింగ్‌గా ఉంది. ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా చిరంజీవి సినిమాతోనే అల్లు అర్జున్‌ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి హీరోగా నటించిన ‘విజేత’ సినిమాలో బాల నటుడిగా కనిపించిన బన్నీ ఆ తర్వాత ‘స్వాతిముత్యం’, ‘డాడీ’ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ‘గంగోత్రి’ సినిమాతో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అయ్యారు. నేడు పుష్ప చిత్రంతో పాన్‌ఇండియా స్థార్‌గా సత్తా చాటుతున్నారు.

 

Leave a Reply