పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నటి పూర్ణ

డ్యాన్సర్, నటి ‘పూర్ణ’ పండంటి మగబిడ్డకు తల్లి అయింది. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త అయిన తన భర్త షానిద్ ఆసిఫ్ అలీకి ఏప్రిల్ 4న ఆమె మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.  పూర్ణ గత ఏడాది కేరళకు వ్యక్తి అయిన శనిద్ అసిఫ్ అలీని అక్టోబర్ లో సీక్రెట్ వివాహం చేసుకుంది . పూర్ణ, షానిద్ ప్రొఫెషనల్ ట్రిప్ లో దుబాయ్ పర్యటనలో కలుసుకున్నారు, ఆ తర్వాత నటి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో వారి నిశ్చితార్థం కొచ్చిలో జరిగింది. అక్టోబర్ 25, 2022న దుబాయ్లో వీరి వివాహం జరిగింది. పెళ్లి విషయాన్ని అభిమానులకు కొన్ని రోజులు తరువాత తెలిపారు పూర్ణ.

కగా 2004లో ‘మంజు పోలోరు పెన్కుట్టి’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తెలుగులో దర్శకుడు రవిబాబుతో కలిసి అవును, ఆవును 2 వంటి వరుస హారర్ చిత్రాల్లో నటించడంతో టాలీవుడ్ లో ఘోస్ట్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. సర్ ప్రైజింగ్ హిట్ అయిన ‘రాజుగారి గది’ సినిమాలో కూడా ఆమె నటించింది. నటనతో పాటు, పూర్ణ కామెడీ స్టార్స్ ధమాకా, కామెడీ స్టార్స్ సీజన్ 3, మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి అనేక డాన్స్ మరియు కామెడీ రియాలిటీ షోలలో జడ్జిగా కూడా పాల్గొంది. ఈ అమ్మడు చివరిసారిగా నాని బ్లాక్ బస్టర్ మూవీ దసరాలో కూడా నటించింది, ఈ చిత్రం మార్చి 30 న విడుదలై థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది.

కాగా పెళ్లి అయిన రెండు నెలలకే అంటే డిసెంబర్ లో తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించరు పూర్ణ. అప్పటి నుంచి సినిమాలకు, టి.వి షో లకు బ్రేక్ ఇచ్చి దుబాయ్ లోనే ఉంటున్నరు. కొన్ని రోజుల క్రితం అక్కడే ఘనంగా సీమంతం కూడా చేసుకుంది పూర్ణ. దుబాయ్ హాస్పిటల్ లోనే బిడ్డకి జన్మినిచ్చిన తరువాత అక్కడి డాక్టర్స్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియా ద్వారా ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంది పూర్ణ. ఇక ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు పూర్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 

 

 

 

 

 

 

Leave a Reply