HHVM: హరిహర వీరమల్లు విడుదల సందడి.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ వైరల్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ బడ్జెట్‌ చిత్రమై ఉండటంతో నిన్నటినుంచే ప్రీమియర్‌ షోలతో ఫ్యాన్స్‌ పండుగ వాతావరణం సృష్టించారు. ఈ ఉదయం నుంచే థియేటర్ల వద్ద అభిమానుల హంగామా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని థియేటర్లలో షోలు హౌస్‌ఫుల్‌ అవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవన్ కళ్యాణ్ ఎక్స్‌ (Twitter)‌లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్‌ హిందువులు తమ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నందుకు విధించిన శిక్షాత్మక జిజియా పన్ను అణచివేతకు నిలువెత్తు చిహ్నంగా నిలిచింది. కానీ చరిత్రకారులు దాని క్రూరత్వాన్ని తగ్గించి చూపించారు. హరిహర వీరమల్లు ఈ అన్యాయాన్ని ధైర్యంగా బయటపెడుతుంది. కోహినూర్‌ దోపిడీ వలెనే హిందువుల బాధలను, భారత సంపద దోపిడీని బహిర్గతం చేస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడిన, నిరంకుశత్వాన్ని ధిక్కరించిన మన గౌరవించబడని వీరుల కథ ఇది” అంటూ తన సినిమా సారాంశాన్ని వివరించారు.

ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా షోలు హిట్‌ అవుతున్నాయి. పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రేక్‌ చేసే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Leave a Reply