ఏపీలో ఒంటిపూట బడుల డేట్ పిక్స్ ఎప్పుడో తెలుసా !

half day school :ఏపీలో ఒంటిపూట బడుల డేట్ పిక్స్ ఎప్పుడో తెలుసా!
ఏపీలో ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఇంత ఎండల్లోనూ చిన్న పిల్లలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ బడుల్లోనే అవస్థలు పడుతున్నారు. అయినా ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒంటిపూట బడులపై నెలకొన్న వివాదానికి నేడు  తెరపడింది.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఒంటిపూట బడులపై ఓ ప్రకటన చేశారు. ఎండలు ఎక్కువగా లేవని కారణంతో ఒంటి పూట బడులు పెట్టలేదని మంత్రి బొత్స తెలిపారు. అలాగే ఉదయం 7.45 నుంచి 12.30 వరకూ మాత్రమే బడులు ఉంటాయన్నారు.

రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లూ ఈ మేరకు 3వ తేదీ నుంచి ఒంటిపూట బడుల నిర్వహణకు సిద్ధం కావాలని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లు ఈ ఉత్తర్వులను ధిక్కరించి బడులు నడిపితే చర్యలు తప్పవని బొత్స హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో విద్యార్ధులకు ఒంటిపూట మాత్రమే స్కూళ్లు నడిపేలా అధికారుల్ని ఆదేశించామన్నారు. ఒంటిపూట బడులపై ప్రశ్నించిన టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన బొత్స టీచర్లపై ఎలాంటి కోపం లేదన్నారు.

మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపైనా బొత్స స్పందించారు. ఈ నెల 3వ తేదీ (సోమవారం) నుంచి 18వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. ఈ పరీక్షలకు ఉదయం తొమ్మిదిన్నర దాటితే అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్ధితుల్లో విద్యార్ధుల్ని అనుమతించే అధికారం అధికారులకు ఇచ్చామన్నారు. 3344 సెంటర్లలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బొత్స వెల్లడించారు. 6 లక్షల 9 వేల 70 మంది ఈసారి పరీక్షలు రాస్తున్నారన్నారు.పదో తరగతి విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోతే అధికారుల్ని సంప్రదిస్తే ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారన్నారు.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh