Dress Code: ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్ కోడ్
Dress Code: ప్రస్తుతం యువతతోపాటు మధ్య వయస్సుల వారికి కూడ జీన్స్, టీషర్ట్స్ వేసుకోవడం ఫ్యాషన్ గా మారింది. అయితే మోడ్రన్ దుస్తులను ప్రవైట్ కంపనీలతోపాటు పలు ఇతర కార్పోరేట్ కంపనీలు సైతం ఆహ్వానిస్తున్నాయి. ఇక కొన్ని ప్రవైట్ కంపనీలు మాత్రమే ఫార్మల్ డ్రెస్‌లు వేసుకుని రావాలనే నిబంధనలు విధిస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు సాధరణంగా Dress Code ఉన్నా, వాటిని ఖచ్చింతంగా అమలు చేయాలనే డిమాండ్ ఉండదు. పలాన దుస్తుల్లోనే రావాలనే నిబంధన కూడ ఉండదు. దీంతో ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులకు దీటుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడ మాడ్రన్ దుస్తులు వేసుకుని తమ కార్యాలయాలకు వస్తున్నారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులపై బీహార్ ప్రభుత్వం కోరఢా ఝలిపించింది
బిహార్‌లోని సరన్ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్, టీషర్టులు ధరించి ఆఫీసుకు రావడాన్ని కోర్టు నిషేధించింది. జీన్స్, టీ షర్టులు ధరించవద్దని, Dress Code,మెడలో గుర్తింపు కార్డులు ధరించాలని సరన్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశించారు. ఇకపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనివేళల్లో కార్మికులు ఫార్మల్ దుస్తులు ధరించి కార్యాలయాల్లోనే ఉండాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో పని సంస్కృతిని మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఏఎన్ఎస్ తెలిపింది.
జిల్లా మేజిస్ట్రేట్ నిర్దిష్ట శాఖలను ఆకస్మిక తనిఖీలు చేస్తారని, కోర్టు ఆదేశాలను పాటిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి వీడియో కాన్ఫరెన్స్ కూడా చేస్తారని, డ్రెస్ కోడ్ ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. అయితే ఇలాంటి ఆదేశాలు బీహార్ లో కొత్తేమీ కాదు. గతంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఆఫీసులో సింపుల్ అండ్ గంభీరమైన దుస్తులు ధరించాలని డ్రెస్ కోడ్ జారీ చేసింది. హుందాతనాన్ని కాపాడేందుకు జీన్స్, టీషర్టులు ధరించి పనిచేయడాన్ని నిషేధించింది. కార్యాలయ సంస్కృతికి విరుద్ధంగా అధికారులు, ఉద్యోగులు దుస్తుల్లో కార్యాలయానికి వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇది కార్యాలయ మర్యాదకు విరుద్ధం’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా హర్యానా ప్రభుత్వం రాష్ట్ర ఆసుపత్రుల్లో వైద్యులు డెనిమ్ జీన్స్, పాలాజో ప్యాంట్లు, బ్యాక్‌లెస్ టాప్స్, స్కర్టులు ధరించడాన్ని నిషేధించింది. అదేవిధంగా, సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ 2021 లో ఏజెన్సీలోని అధికారులందరూ విధి నిర్వహణలో ఫార్మల్స్ ధరించాలని ఆదేశించారు, క్యాజువల్ డ్రెస్సింగ్‌ను అనుమతించబోమని హెచ్చరించారు. జీన్స్, టీ షర్టులు, స్పోర్ట్స్ షూస్, చెప్పులు క్యాజువల్ దుస్తులను కార్యాలయంలోకి అనుమతించరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.