తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దర్శననికి సమయం పొడిగింపు

Thirumala Thirupathi :తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ దర్శననికి సమయం పొడిగింపు

వేసవి సెలవులు కావడంతో  తిరుమలకు  భారీగా భక్త జనం తరలి వస్తున్నారు. ప్రస్తుతం కొండ పైన రద్దీ బాగా పెరిగింది. ఏప్రిల్‌ 15 నుండి జూలై 15వ తేదీ వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300/ దర్శన టికెట్లను టిటిడి బోర్డు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.అలాగే  తిరుమలలో 85 శాతం వసతి సౌకర్యాలు కల్పించడం ద్వారా సాధారణ సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏప్రిల్ 7న నిర్వహించిన ‘డయల్ యువర్ ఈఓ’ కార్యక్రమంలో వీఐపీ బ్రేక్‌లను తగ్గించాలని, సాధారణ యాత్రికుల దర్శన వేళలను పెంచాలని ఓ కాలర్ సూచించారు. దీనికి సమాధానంగా18 గంటల్లో వీఐపీలకు మూడు గంటలు, సాధారణ యాత్రికులకు మిగిలిన 15 గంటల సమయం కల్పిస్తామని ఈవో తెలిపారు.

తిరుమలోల శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం వీఐపీల నుంచి వస్తున్న ఒత్తిడిని భరించలేకున్నానని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. శుక్రవారి శ్రీవారి అభిషేకం టికెట్ల కోసం దాదాపు 250 మంది వీఐపీలు జేఈవో కార్యాలయానికి దరఖాస్తు చేసారు. టికెట్లు 160 ఉండగా, అందులో 130 ముందుగానే మిగిలిన 30 టికెట్ల కోసం వీఐపీలు ఒత్తిడి చేసారని చెప్పారు. అభిషేకం టికెట్లు ఎక్కువ ఇచ్చినా లోపల వారికి కూర్చునే పరిస్థితి ఉండదన్నారు. దీంతో విధులు నిర్వహించటం కష్టంగా మారిందని వివరించారు.భక్తులకు అందించే అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచడానికి గతంలో లాగే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

ఏప్రిల్ 15 నుంచి ప్రారంభమయ్యే వీఐపీ రిఫరల్స్, రూ.300, శ్రీవాణి, వర్చువల్ సేవ, పర్యాటక టిక్కెట్లను జూలై 15 వరకు తగ్గించాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. సాధారణ యాత్రికుల కోసం 85% వసతి, 7,400 గదులు, నాలుగు పీఏసీలు అందుబాటులో ఉంటాయని ఈవో స్పష్టం చేశారు. తిరుమలలో ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్‌ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్‌ వచ్చిన తర్వాత సంబంధిత సబ్‌ ఆఫీసుకు వెళ్లి గదులు పొందాలి. ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరని చెప్పుకొచ్చారు. నిర్ణీత సమయం(రెండు గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుంది. గదికి చెల్లించిన అద్దె తిరిగి ఇవ్వబడదు. కాషన్‌ డిపాజిట్‌ మాత్రమే తిరిగి చెల్లించడం జరుగుతుందన్నారు. ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా గదులు త్వరగా ఖాళీ అవడమే గాక, భక్తులకు గతంలో కంటే మరిన్ని ఎక్కువ గదులు కేటాయించే అవకాశం కలుగుతోంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh