Congress : ఈనెల 30న కాంగ్రెస్ లో చెరనున్న పొంగులేటి
Congress: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరడానికి డేట్ పిక్స్ అయ్యింది.
గత కొంత కాలంగా పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే దాని పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
సుదీర్ఘ చర్చలు కాంగ్రెస్ అగ్ర నేతల హామీల తరువాత పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు.
విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో పొంగులేటి చర్చించారు. కీలక హమీ దక్కించుకున్నారు.
అలాగ ఈనెల 22న రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, దామోదర రెడ్డి, పిడమర్తి రవి, పలువు నేతలు భేటీ కానున్నారు.
ఈ భేటీలో రాహుల్ గాంధీతో పలు అంశాలపై చర్చించిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు జూపల్లి, పొంగులేటి ప్రకటిస్తారని తెలుస్తోంది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఉన్నాయని..పార్టీ సీట్ల కేటాయింపు.
.అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఉంటుందని పొంగులేటికి రాహుల్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదే సమయంలో భట్టి, రేణుకా చౌదరితో డీకే శివకుమార్ ఈ నేతల చేరిక పైన చర్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈనెల 30న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ద్వారా పొంగులేటి, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఈ సభలో రాహుల్ లేదా ప్రియాంక గాంధీలలో ఒకరు పాల్గోనున్నారు. అయితే, 30వ తేదీనే ఖమ్మంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
అయితే పొంగులేటి ఇప్పటికే తన అనుచరులకు ఈ విషయంపై పొంగులేటి స్పష్టతనిచ్చినట్లు తెలిసింది.
పొంగులేటితో పాటు పాయం వేంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకట్రావు, బానోత్ విజయాబాయి, కోటా రాంబాబు,
మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్, జారే ఆదినారాయణ, దొడ్డా నగేష్ యాదవ్ లతో పాటు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావు టీంతో పాటు దామోదర్ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారని సమాచారం.