CM Stalin: ఏకంగా సీఎంనే బురిడీ కొట్టించిన యువకుడు
CM Stalin: ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అని సిఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడుపై కేసు నమోదు చేశారు తమిళనాడు పోలీసులు. సిఎం సహా మంత్రులకు, ప్రజలను మోసం చేసినా ఘటనపై పలు కేసులు నమోదు చేసి.. అరెస్టు చేశారు. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ మోసం చేశాడు యువకుడు వినోద్ కుమార్. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ వినోద్ కుమార్ అనే యువకుడు మోసం చేశాడు.
మంత్రి రాజకన్నప్పన్ నియోజకవర్గానికి చెందిన వినోద్‌బాబు మంత్రిని కలుసుకుని అభినందించి విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. అనంతరం మంత్రి ఆర్థిక సాయం కూడా చేశారు. ఈ స్థితిలో కొద్దిరోజుల క్రితం మంత్రితో కలిసి చెన్నై వెళ్లిన వినోద్ బాబు.. లండన్ లో జరిగిన పోటీలో విజయం సాధించానని ముఖ్యమంత్రి CM Stalin ను కలిసి అభినందనలు అందుకున్నాడు.
పాస్‌పోర్టు కూడా లేని తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన వికలాంగుడు వినోద్‌బాబు పాకిస్థాన్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో ట్రోఫీ గెలుచుకున్నందుకు ముఖ్యమంత్రిని అభినందించారు. వినోద్ బాబు స్వస్థలం రామనాథపురం జిల్లా ఎగువ సెల్వనూరు. వికలాంగుడైన తాను గతేడాది డిసెంబర్లో పాకిస్థాన్‌లోని కరాచీలో జరిగిన ఆసియా కప్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు కెప్టెన్‌గా పాల్గొని ట్రోఫీని గెలుచుకున్నానని చెప్పాడు. వినోద్ కుమార్ మాటలు నమ్మి అతనికి భారీ స్ధాయిలో ఆర్ధిక సహాయం చేశారు స్దానికులు, మంత్రులు. CM Stalin సైతం అతనికి అభినందనలు తెలిపారు. కొందరి క్రీడాకారుల ఫిర్యాదుతో లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. వినోద్ కుమార్ మొత్తం అబద్ధాలు చెప్పి అందరినీ మోసం విచారణలో తేలింది. కలకత్తాలో జరిగిన ఓ మ్యాచ్‌లో ఆడి …అక్కడే ఒక కప్పుకొని..లండన్ మ్యాచ్ అంటూ కలరింగ్ ఇచ్చినట్లు తమిళనాడు పోలీసులు తేల్చి.. వినోద్ ను బొక్కలో వేశారు.ఈ ఏడాది మొదట్లో జిల్లా కలెక్టర్‌ను కలిసిన వినోద్‌బాబు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని అభ్యర్థించారు.