CM KCR ఈనెల 15న TRSLP సమావేశంTS.
ఈ నెల 15వ తేదీన TRSLP, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ అధ్యక్ష్యతన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. TRS పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మునుగోడు ఎన్నిక ఫలితాలు, బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
2.హరీష్ రావు వ్యాఖ్యలకు అంబటి కౌంటర్AP.
పోలవరం మరో ఐదేళ్ళయినా పూర్తికాదు, కాళేశ్వరం పూర్తిచేశామన్న తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి రాంబాబు తప్పుపట్టారు. ఈ రెండింటికీ నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. కాళేశ్వరం బ్యారేజీ అని, పోలవరం భారీ ప్రాజెక్ట్ అని అన్నారు. ఈ రెండింటినీ పోల్చడం సరికాదన్నారు. గొప్పలు చెప్పుకోవడానికే హరీష్ అలా మాట్లాడరని విమర్శిచారు. TRSను తక్కువ చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.
3.జగన్ పాలనలో నలుగురు రెడ్లే బాగుపడ్డారు:AP.
సీఎం జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీడీపీ నాయకుడు లోకేష్ విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని ఆరోపించారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ నలుగురు చేతిలో రాష్ట్ర ప్రజలందరూ బలైపోయారని ఎద్దేవా చేశారు. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు.
4.ప్రధాని సమక్షంలోనే పొలిటికల్ ట్విస్ట్…టీడీపీ,జనసేనకు ఝలక్.
సీఎం జగన్ ప్రధాని పర్యటన వేళ..సిట్యుయేషన్ ను తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసారు. అటు ప్రధానితో పవన్ భేటీ తరువాత.. బీజేపీ – జనసేన మధ్య పొత్తు..త్వరలో టీడీపీని కలుపుకు వెళ్తారనే ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే.. విశాఖ కేంద్రంగా జరిగిన బహిరంగ సభలో ప్రధానితో తమ అనుబంధం గురించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధాని మోదీ ఏపీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసే ఏ మంచి అయినా కూడా.. ఈ రాష్ట్రం, ఈ ప్రజానీకం ఎప్పటికీ గుర్తుపెట్టుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. అదే సమయంలో.. కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యేకంగా మీతో మా అనుబంధం.. పార్టీలకు, రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించటం ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమైంది.
5.గ్రూప్ -2కి 40 లక్షల మంది ప్రిపేర్ అయితే 36 పోస్టులు తీశారు’
AP: విజయనగరం పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుట ఓ నిరుద్యోగి తన ఆవేదనను బయటపెట్టాడు. రాష్ట్రంలో గ్రూప్-2కి 40 లక్షల మంది ప్రిపేర్ అయితే 36 పోస్టులు తీశారని వాపోయాడు. కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్లి.. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు కట్టుకుంటూ కష్టపడి చదువుతామని, ఈ పోస్టులు ఎలా సరిపోతాయని ఆవేదన చెందాడు.
6. ఫార్ములా రేసుకు సిద్ధమవుతున్న హైదరాబాద్
TS: ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా 6టీమ్స్ నుంచి 24 రేస్ డ్రైవర్లు ఇందులో పాల్గొననున్నారు. కాగా.. నవంబర్ 19, డిసెంబర్ 11వ తేదీల్లో హుస్సేన్నాగర్ తీరంలో ఈ రేసు జరుగనుంది. ఈమేరకు అధికారులు రోడ్లను పునర్నిర్మించారు. ప్రేక్షకులు చూసేందుకు కూడా సీటింగ్ ఏర్పాట్లు చేశారు.
7.బాలయ్య షోకు మాజీ సీఎం!
బాలకృష్ణ అన్పబుల్ షోకు గెస్ట్ గా మరో రాజకీయ ప్రముఖుడు రానున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. బాలయ్యకు, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య స్నేహ బంధం ఉంది. ఈ ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ మంచి మిత్రులు. ఇక ఈ ఎపిసోడ్లో బాలయ్య.. కిరణ్ కుమార్ రెడ్డి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? ఎలా ఆటపట్టిస్తారు? అన్నది చూడాలి.
8.మళ్ళీ ఒక్కటౌతున్న సమంత ,చైతూ.
నాగచైతన్య, సమంత ఓ టై టాలీవుడ్ బెస్ట్ కపుల్… కానీ ఈ జంట అనుకోకుండా విడాకులు తీసుకుని ఫ్యాన్స్ కి కోలుకోలేని షాక్ ఇచ్చారు. కానీ ఈ జంట విడిపోయిన వార్త తెలిసిన దగ్గర నుంచి వారి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఇక రీసెంట్ సమంత మయోసైటిస్ (myositis disease)అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. తనకు ఎంత దూరంగా ఉంటే మాత్రం వారి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ ఏం పోదు కదా..! ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. చాలా కాలం కలిసి ట్రావెల్ చేశారు. ఒకరి గురించి మరొకరికి బాగా తెలుసు కూడా. విడిపోతే మాత్రం.. ఏదైనా సమస్య వస్తే..
ఒకరికి మరొకరు తోడు నిలవకుండా ఉంటారా అలా ఆలోచించి సామ్ ని మంచి మనసుతో పలకరించాడు చైతు. ఇక అసలు విషయం ఏంటంటే సమంత.. నాగ చైతన్య ఒక ప్రాజెక్టు కోసం జతకట్టబోతున్నట్లు సమాచారం. వారిద్దరి మధ్య ఇప్పటి వరకు జరిగిన సంఘటన విడిచిపెట్టి, వృత్తిపరంగా కలిసి పనిచేయడానికి సిద్ధం అయినట్లు వినిపిస్తుంది.. అదే కనుక జరిగితే ఈ జంటను తెరపై చూసేందుకు అభిమానులు థియేటర్ లకు క్యూ కడతారు.. ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి మరి.
9. పాకిస్తాన్‌కు భారత్ పంచ్.
T20WCలో పాకిస్తాన్ ఓడిపోవడంతో భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఆ దేశ ఆటగాళ్లు, అభిమానుల ఓవర్ యాక్షనే. సెమీస్‌లో భారత్ ఓడిపోగా.. ‘ఇండియా బౌలర్లలా, పాకిస్తాన్ బౌలర్లు చేతకాని వారు కాదు. మాతో ఫైనల్లో జాగ్రత్త ఇంగ్లండ్’ అని షోయబ్ నిన్న కామెంట్స్ చేశాడు. ఇప్పుడు పాక్ ఓడిపోవడంతో బ్రోకెన్ హార్ట్ సింబల్ పెట్టాడు. దీనికి భారత బౌలర్ షమీ ‘సారీ బ్రదర్. కర్మ అంటే ఇదే’ అని పంచ్ ఇచ్చాడు.
మరోవైపు ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ విజేత కావడంపై భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. ‘ఈ ప్రపంచకప్ ద్వారా ఓ పాఠం నేర్చుకోవాలి. పాకిస్తాన్ కేవలం బౌలింగ్ ద్వారా కప్ గెలవదు. భారత్ కేవలం బ్యాటింగ్ ద్వారా విజేత అవ్వదు. ENGకు బ్యాటర్లు, స్పిన్నర్లు, పేసర్లు, ఫీల్డర్లు.. అలాగే అదృష్టం ఉండటం వల్ల గెలిచింది’ అని చెప్పాడు.