CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు అంటున్న కేసీఆర్
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్‌చెరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొల్లూరులో 128 ఎకరాల్లో నిర్మించిన 15,600 డబుల్బెడ్రూం ఇళ్లను ప్రారంభించిన
ఆయన ఆరుగురికి పట్టాలు అందజేశారు ముఖ్యమంత్రి అనంతరం పటాన్చెరు పట్టణంలో సుమారు రూ.184 కోట్లతో 200 బెడ్‌ల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన
చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు మాట్లాడుతూ.. ఒక్కటే మాట మనవి చేస్తున్నా మోసపోతే.. గోసపడుతాం..
ఏ ఉద్దేశంతో తెలంగాణను తెచ్చుకున్నమో.. దాన్ని బ్రహ్మాండంగా ఒకగాడిలో పెట్టుకొని ఆర్థికపరంగా ముందుకెళ్తున్నాం పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నాం కేసీఆర్ కిట్ ఎలా
ఉంటుందో చూశారన్నారు. హరీశ్‌రావు ఆరోగ్యమంత్రిగా వచ్చాక వైద్యరంగం కొత్త పరుగులు పెడుతున్నదన్నారు. కేసీఆర్ కిట్ కాదు మహిళలు గర్భిణులగా ఉన్నప్పుడే పుట్టబోయే
బిడ్డ, తల్లి ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్‌ను తీసుకువచ్చారు. వైద్య ఆరోగ్య రంగంలో పరిస్థితి ఎలా ఉండేదో తెలుసు. హైదరాబాద్‌కు వెళ్లే గాంధీ, ఉస్మానియా,
నిలోఫర్ తప్ప మరొకటి లేకుంటే. అద్భుతమైన ఐదు కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రులు తీసుకువస్తున్నామన్నారు.
అయితే ఆస్పత్రి నిర్మాణం ఖర్చులో రాష్ట్ర వాటా 25 శాతం ఉంటుందని తెలిపారు. మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. పటాన్ చెరు నుంచి హయత్
నగర్ వరకు మెట్రో రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారని వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే పటాన్ చెరుకు ఐటీ
కంపెనీలు వచ్చేలా చూస్తాం అని హామీ ఇచ్చారు.
అలాగే పటాన్ చెరుకు పాలిటెక్నీక్ కాలేజీని మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మూడు మిన్సిపాలీటీలకు రూ.30కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ గ్రామ పంచాయితీకి రూ.15లక్షలు మంజూరు
చేసి వాటిని విడుదల చేస్తామన్నారు. ఒకప్పుడు పటాన్ చెరులో కరెంట్ కోసం పరిశ్రమలు సమ్మె చేశాయని కానీ ఇప్పుడలా కాదు రోజుకు 24గంటలు కరెంట్ ఇస్తున్నాం దీంతో పరిశ్రమలు మూడు షిఫ్టుల్లో
పనిచేస్తున్నాయన్నారు.