Chandrababu :గెలుపే లక్ష్యంగా చంద్రబాబు మేనిఫెస్టో పై వైసీపీ నాయకుల ఆగ్రహం
Chandrababu : ఏపీలోని రాజమండ్రిలో ఆదివారం నిర్వహించిన టీడీపీ మహానాడులో చంద్రబాబు ఎన్నికల శంఖారావం పూరించారు.
ఈ సందర్భంగా ఆయన మేనిఫెస్టో విడుదల చేశారు. 2024లో తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే 6 ప్రధాన
హామీలను చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. బీసీలు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు,
యువతను ఆకర్షించేలా ఆ 6 హామీలు ఉన్నాయి. ఇక “దీపం” పథకం కింద.. ప్రతి కుటుంబానికి
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామన్నారు. “ఉచిత బస్సు ప్రయాణం”
పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని
చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అలాగే నిరుద్యోగులకుChandrababu : నెలకు రూ.3 వేల
భృతి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. మహా శక్తి పథకం ద్వారా.. ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు
నిండిన మహిళలకు “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో
జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. అలాగే ‘యువగళం’ పథకం కింద ఐదేళ్లలో 20 లక్షల
ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలోని ప్రతి బిడ్డ చదువుకు ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తామని
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ‘తల్లికి వందనం’ పేరుతో ఈ పథకం అమలు
చేస్తామని, కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అంత మందికీ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
బీసీల రక్షణ కోసం చట్టం తెచ్చి వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని చంద్రబాబు ప్రకటించారు.
ప్రస్తుత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన బీసీలను తాము ఆదుకుంటామని స్పష్టం చేశారు.
అలాగే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటింటికీ మంచి నీరు.
. పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అలాగే ‘అన్నదాత’ కార్యక్రమం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అలాగే బీసీలకు రక్షణ చట్టం తెచ్చి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
‘‘ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి తాగునీరు అందిస్తం. సంపద సృష్టించి ప్రజలకు పంపిణీ చేస్తం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తం” అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
అయితే చంద్రబాబు ఇచ్చిన వరాల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
అసలు చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కాదని మానిక్యూలేటర్ అని వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శించారు.
చంద్రబాబు మేనిఫెస్టోలో చెప్పినChandrababu : హామీలు దరిద్రంగా ఉన్నాయని మండిపడ్డారు.
అలాగే కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు ఎన్టీఆర్‌కి ఎందుకు ‘భారతరత్న’ తీసుకురాలేదని
అంబటి రాంబాబు ప్రశ్నించారు. టీడీపీకి ఇదే చివరి మహానాడు అవుతుందని..
వచ్చే ఎన్నికల తర్వాత ఇక ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.