తెలంగాణ అప్పుల చిట్టా…. ఎన్ని లక్షల కోట్లంటే.. ?
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర౦ లో అప్పులు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది కేంద్ర సర్కార్.కానీ అవిర్భావ సమయంలో అతి తక్కువ అప్పులతో ఉన్న రాష్ట్ర౦ నేడు లక్షల కోట్ల అప్పులు చేసిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయంది. 2021 – 22 నాటికి రూ. 2.83 లక్షల కోట్లుగా ఉన్న తెలంగాణ అప్పులు 2022 అక్టోబర్ నాటికి రూ. 4.33 లక్షల కోట్లకు చేరిందని. కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలంగాణ అప్పుల చిట్టాను వివరించారు. 12 బ్యాంకుల నుంచి కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలే రూ. 1.3 లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపారు.
2014లో తెలంగాణ ఆవిర్భావం నాటికి రాష్ట్ర అప్పులు రూ.75,577 కోట్లు ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 2.83 లక్షల కోట్లకు పెరిగాయని. అయితే 2022 అక్టోబర్ నాటికి రూ.4.33 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పు అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఏటా పెరుగుతూనే ఉన్నాయని. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేస్తోందని. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాలా తీసే పరిస్థితులు తీసుకొస్తోందని బీజేపీ, కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన రాష్ట్రాన్ని. నేడు అత్యధిక అప్పులున్న రాష్ట్రాల జాబితాలో చేర్చారని విపక్ష నేతలు బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడుతున్నాయి. తెచ్చిన అప్పులను కూడా సరైన రీతిలో వినియోగించడం లేదని ఇస్టం వచ్చినట్లు. యథేచ్ఛగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహంవవున్నారు. ఈ విమర్శలను తిప్పికొడుతున్న సర్కార్… తెచ్చిన అప్పులతో అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని అంటోంది. తద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి భారీ మొత్తంలో రెవెన్యూ వస్తుందని చెబుతోంది.
ఇది కూడా చదవండి :