భగ్గుమంటున్న బంగారం ధరలు ఎంత అంటే ?

GOLD SILVER RATES TODAY

 Gold rate : భగ్గుమంటున్న బంగారం ధరలు

బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎదుకంటే పసిడి రేటు మళ్ళీ  పరుగులుపెడుతున్నాయి.  గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇటీవల క్రమంగా పైపైకి కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

దీంతో మన మార్కెట్‌లో కూడా పసిడి రేటు పైపైకి చేరుతోందని తెలియజేస్తున్నారు. హైదరాబాద్‌లో మార్చి 4న పసిడి రేటు బంగారం ధరలు మరింత పెరిగాయి  కళ్ళు  జిగేల్ మంటూ  వున్నాయి.  పది గ్రాములకు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 మేర పైకి చేరింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 56,550కు పెరిగింది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు కూడా మెరిసింది. ఈ పసిడి రేటు పైపైకి చేరింది పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 మేర పెరిగింది. దీంతో ఈ బంగారం ధర కూడా పది గ్రాములకు రూ. 51,850కు చేరింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. బంగారం ధర నిన్న నిలకడగానే కొనసాగింది అయితే ఈరోజు మళ్లీ పైకి చేరింది. కాగా బంగారం ధర గత ఐదు రోజుల్లో చూస్తే.. రూ. 500కు పైకి చేసింది. పైన

పేర్కొన్న బంగారం ధరలకు వస్తు సేవల పన్ను  అదనం. ఇంకా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల బంగారం ధరలకు వీటిని కూడా కలుపుకుంటే. అప్పుడు పసిడి రేటు మరింత పైకి చేరుతుందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లో చూస్తే. బంగారం ధరలు పైకి చేరాయి. పసిడి రేటు ఔన్స్‌కు 1.21 శాతం మేర పెరిగింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1862 డాలర్లకు చేరింది. ఇక వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి రేటు 2.32 శాతం మేర పైకి చేరింది. దీంతో వెండి ధర ఔన్స్‌కు 2.13 శాతం మేర పైకి చేరింది.

ఇది కూడా చదవండి :

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh