త్వరలోనే కేసీఆర్ తో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ
BRS: బీజేపీకి వ్యతిరేకంగా మహాకూటమి ఏర్పాటు దిశగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు వేగంగా వేస్తున్నారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా పోరాడటంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కీలక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరుపనున్నట్టు తెలుస్తున్నది. మహాకూటమి ఏర్పాటు కోసం ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే తాను దాదాపు అన్ని పార్టీల నాయకులతో మాట్లాడనని, ఐక్యంగా ముందుకు సాగేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు.
అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే నితీశ్ కుమార్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితో మంతనాలు జరిపానని, వారు ఐక్యంగా ముందుకు సాగేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక ఆయనత్వరలో చాలా పార్టీలు ఏకతాటిపైకి వస్తాయని శుక్రవారం అంబేద్కర్ం జయంతి సందర్భంగా తన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
BRS: లెఫ్ట్ పార్టీలతో కూడా ఆయన మాట్లాడారు. అందరి ఆమోదంతో బీజేపీ వ్యతిరేకంగా ఏకతాటి పైకి వచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకోవడానికి విపక్షాలన్నీ సమావేశమై చర్చించుకోవాలన్నది నా కోరిక అని నితీశ్ కుమార్ పేర్కొన్నారు.
అలాగే నితీష్ కుమార్ ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాల ఐక్యతను ఏవిధంగా పటిష్టం చేయాలనే అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మనీ లాండరింగ్ కేసులో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఈడీ ఎదుట హాజరైన రోజే బీహార్ నేతలిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో పర్యటించారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజా, సీతారాం ఏచూరితో భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ తోనూ చర్చలు జరిపారు. గత ఫిబ్రవరిలో విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు.
నితీశ్ బుధవారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో భేటీ కావడంతో విపక్షాల ఐక్యతా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌కు సమ దూరాన్ని పాటిస్తున్న పార్టీలతో చర్చించేందుకు నితీశ్ అంగీకరించినట్టు తెలుస్తున్నది. దీనిలో భాగంగా ఇప్పటికే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నితీశ్ కలిశారు