Bhola Shankar: సెంటిమెంట్ ప్లేస్ లో భోళా శంకరుడు
Bhola Shankar: టాలీవుడ్ మెగా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా మెహర్ రమేష్ దర్శకతంలో తెరకెక్కితున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “భోళా శంకర్”. ఈ చిత్రం లో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా,అయితే సైరా నరసింహా రెడ్డి’ తర్వాత చిరు, తమన్నా నటిస్తున్న చిత్రమిది. అలాగే మరో టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సోదరి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. ఆమెకు జోడిగా ఏయన్నార్ మనవడు, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కనిపిస్తారని సమాచారం. సినిమాలో ఆయన కూడా ఉన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా ప్లాన్ చెయ్యబడింది.
ఇక ఈ చిత్రం అయితే ఇపుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా నిన్ననే మేకర్స్ అంతా కలకత్తా కి వెళ్లారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ వింటేజ్ హిట్ కోల్ కతాలో! ‘చూడాలని ఉంది’లో ‘యమహా నగరి కలకత్తా పురి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిందే.
ఇక కలకత్తా బ్యాక్ డ్రాప్ కూడా కలిసి రావడంతో మరింత పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఇక లేటెస్ట్ గా అయితే ఈరోజు నుంచే యాక్షన్ మొదలు పెట్టిన మెగాస్టార్ పై మేకర్స్ ఆన్ లొకేషన్ స్టిల్స్ అయితే వదిలారు.
మరి వీటిలో మెగాస్టార్ మరింత చార్మింగ్ గా కనిపిస్తుండగా తన స్వాగ్ తో అదరగొట్టారు. దీనితో ఈ పిక్స్ మెగా ఫ్యాన్స్ కి ట్రీట్ గా మారాయి. ఇక ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ‘ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ పేర్కొంది. విడుదల తేదీ మారోచ్చని ఆ మధ్య వినిపించింది. అయితే, మే డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లలో విడుదల తేదీని మరోసారి కన్ఫర్మ్ చేశారు. టాక్సీ డ్రైవర్ లుక్కులో చిరు పోస్టర్లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి.