Avinash: ఆసుపత్రి నుంచి అవినాష్​ తల్లి డిశ్చార్జ్​

Avinash:

Avinash: ఆసుపత్రి నుంచి అవినాష్​ తల్లి డిశ్చార్జ్​

Avinash: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు సందర్భంగా ఆరోపణలు

ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తన తల్లి శ్రీలక్ష్మి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

మరో హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసిన డాక్టర్లు శ్రీలక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

అందుకే డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని కర్నూలు విశ్వభారతి

ఆసుపత్రి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటంతో వైద్యులు కొద్దిసేపటి క్రితం డిశార్జ్ చేశారు.

అయితే గత వారం రోజులుగా వైద్యులు చికిత్స అందించిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచి కర్నూలు ఆస్పత్రి లో వుండి తన తల్లి ని దగ్గర వుండి జాగ్రత్త చూసుకున్నాడు.

అయితే    వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్​కు తరలించారు.

అవినాష్‌ హైదరాబాద్‌ బయల్దేరిన సమయంలో పెద్ద ఎత్తున ఆయన

అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అవినాష్​తో పాటు కొద్దిమంది అనుచరులు కూడా హైదరాబాద్‌కు వెళ్లారు.

అసలు ఈ నెల 16న విచారణకు రావాలని వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.

కానీ తనకు ముందుస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని తనకు మూడు రోజులు సమయం కావాలని కోరారు.

దీంతో ఈ నెల 19న విచారణకు రావాలని మరో నోటీసు ఇచ్చింది సీబీఐ.

ఆ రోజు విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషంలో తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని.

విచారణకు రాలేనని సీబీఐ Avinash:రెడ్డి లేఖ రాశారు.

ఆ వెంటనే అవినాష్ రెడ్డి పులివెందులకు బయల్దేరారు.

అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు.

కానీ ఆమె ఆరోగ్య పరిస్థితిని చూసి మార్గ మధ్యలో కర్నూలులోనే విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చారు.

ఈ నెల 19న విచారణకు హాజరుకాకపోవడంతో.

ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది.

అయితే తన తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.

తాను మరో వారం పాటూ విచారణకు రాలేనని చెప్పారు.

మరోవైపు తల్లి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు హాజరు కాని అవినాష్

రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇదే క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్

ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణకు సిద్ధమైంది. వాస్తవానికి నిన్న

విచారణ జరగాల్సి ఉండగా ఆలస్యం కావడంతో ఈ రోజు కి  వాయిదా వేశారు.

ఈ రోజు  ఉదయం పదిన్నర గంటలకు తెలంగాణ హైకోర్టులో ఈ విచారణ ప్రారంభమైంది.

అయితే ఈ విషయం పై విచారణ జరిపి హైకోర్టు నేడు  తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఈ నేపధ్యంలో కర్నూలు ఆస్పత్రి నుంచి తల్లి శ్రీలక్ష్మి డిశ్చార్జ్ అయి హైదరాబాద్ కు

తరలిస్తే హైకోర్టు తాజా ఆరోగ్య పరిస్ధితి ఆధారంగా Avinash:ముందస్తు బెయిల్ పై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh