Atiq Ahmed: హత్యపై భారత్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆల్‌ఖైదా
Atiq Ahmed: మాఫియా డాన్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఏప్రిల్ 15 రాత్రి పోలీసుల సమక్షంలో, మీడియా ఎదుటే హత్య చేయడం ప్రయాగ్‌రాజ్‌లో మాత్రమే కాక, దేశ, విదేశాల్లో చర్చనీయాంశమైంది.
గ్యాంగ్స్‌టర్ Atiq Ahmed అతని సోదరుడు ఆష్రఫ్‌ల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని .రంజాన్ వేళ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా భారత్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈద్ సందర్భంగా లేఖ విడుదల చేసింది. భారత్ పై దాడి చేస్తామంటూ అందులో పేర్కొంది. మరోవైపు అతీక్ అహ్మద్ సోదరులను అమరవీరులుగా పేర్కొంది.
మొత్తం ఏడు పేజీలతో ఉన్న లేఖను ఆల్ ఖైదా తమ అనుకూల మీడియా ద్వారా విడుదల చేసింది. ఇందులో ముస్లింలకు విమోచన కల్గిస్తామంటూ సీరియస్‌గా చెప్పింది. ఇకపై భారత్‌ను వదిలేది లేదంటూ హెచ్చరించిన ఆల్ ఖైదా ఏ క్షణమైనా దాడులు నిర్వహిస్తామని వెల్లడించింది. ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామని ఈ ఉగ్రవాద సంస్థ హామీ ఇచ్చింది.
Atiq Ahmed అతని సోదరుడు అష్రాఫ్‌లను అమరవీరులుగా అభివర్ణించిన ఆల్ ఖైదా సంస్థ ఇక భారత్‌కు తామేంటో చూపుతామని వెల్లడించింది. ఇదిలా ఉంటే అతీక్ అహ్మద్‌కు పలు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలుండేవని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదానికి, అండర్ వరల్డ్ మాఫియాకు చోటు లేదని త్వరలోనే మట్టుబెడతామంటూ యోగీ సర్కార్ హెచ్చరించింది. అయితే అతీక్ సోదరులను మాత్రం ముగ్గురు యువకులు తుపాకులతో కాల్చి హత్య చేశారు.
అయితే సరిగ్గా వారం రోజుల క్రితం వైద్య పరీక్షల కోసం అతీక్ అహ్మద్, అష్రఫ్‌లను ఏప్రిల్ 15 రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారు పోలీసు జీపు దిగగానే మీడియా చుట్టుముట్టింది. ప్రశ్నలు వేయడం ప్రారంభించారు జర్నలిస్ట్‌లు. ఆ సమయంలోనే జర్నలిస్ట్‌ల మాదిరి వచ్చిన నిందితులు కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ అక్కడికక్కడే మరణించారు. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్, జర్నలిస్ట్ గాయపడ్డారు. పిస్టల్‌ను కిందపడేసి ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన తర్వాత ఉత్తర ప్రదేశ్ రాష్ట్రమంతా సెక్షన్ 144 విధించారు. హై అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల విషయంపై విపక్షాలు యోగి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ముగ్గురి నిందితుల్ని కోర్టులో హాజరు పరిచారు. వారిని 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు పంపింది. అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లకు పోస్ట్‌మార్టం నిర్వహించి, అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొత్తం ఘటనపై జ్యూడిషియల్ విచారణ నిర్వహించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది