Ashada Bonalu 2023 : ‘ఇక బోనమెత్తుడే’… ఈనెల 22 నుంచి ప్రారంభం

Ashada Bonalu 2023

Ashada Bonalu 2023 : ‘ఇక బోనమెత్తుడే’… ఈనెల 22 నుంచి ప్రారంభం

Ashada Bonalu 2023 : భాగ్యనగరంలో బోనాల పండగ సందడి మొదలైంది. బోనాలు ఏటా ఆషాఢ మాసంలో జరుపుకునే హిందూ పండుగ.

ఈ ఏడాది జూన్ 22న గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి.

ఈ పండుగను జంట నగరాలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు.

ఈ పండుగను జంట నగరాలు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు.

హైదరాబాద్: బోనాలు ఏటా ఆషాఢ మాసంలో జరుపుకునే హిందువుల పండుగ. ఈ ఏడాది జూన్ 22న గోల్కొండ బోనాలు ప్రారంభమయ్యాయి.

గోల్కొండ ఆషాఢ బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి చాటి చెప్పే బోనాల పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తుందని.

. దీని ద్వారా తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతికి పెద్దపీట వేసిందని సీఎం పేర్కొన్నారు.

అలాగే తరతరాల తెలంగాణ సాంస్కృతిక ఆధ్యాత్మిక అస్థిత్వానికి బోనాల పండుగ ప్రతీకగా నిలిచిందన్నారు. అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు రాష్ట్ర ప్రజ‌ల‌పై ఎల్లవేళలా కొనసాగుతూనే ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా, దేశవ్యాప్తంగా

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా దీవించాలని సీఎం కేసీఆర్ అమ్మవారిని ప్రార్థించారు.

ఇక ఆషాడ బోనాల ఉత్సవాలతో జంటనగరాలు… నెల రోజులపాటు సందడిగా మారనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు.

ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల నిర్వహణకు 15 కోట్ల రూపాయలను సర్కార్ కేటాయించినట్లు మంత్రి తలసాని ప్రకటించారు.

సంప్రదాయానికి చిహ్నం బోనం. స్త్రీమూర్తులే త‌యారు చేస్తారు. గ్రామ దేవ‌త‌ల‌కు ప‌సుపు కుంకుమ‌లు, చీర‌సారెలు, భోజ‌న నైవేద్యాల‌తో మొక్కులు చెల్లిస్తారు.

ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, ముత్యాల‌మ్మ, పెద్దమ్మ.. గ్రామ దేవతలను తమను చల్లంగా చూడలమ్మా అంటూ.. వేడుకుంటారు. గ్రామానికి, కుటుంబానికి ఎలాంటి..

ఆపద రాకూడదని మెుక్కుకుంటారు. అయితే ఈ బోనాలు.. తెలంగాణతోపాటుగా.. ఏపీలోని రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లోనూ చేసుకుంటారు.

అన్నం, పాలు, పెరుగుతో కూడిన బోనాన్ని అమ్మవారి కోసం మ‌ట్టి లేదా రాగికుండలో వండుతారు. ఆ త‌ర్వాత‌ బోనాల కుండ‌ల‌ను వేప రెమ్మలతో, ప‌సుపు, కుంకుమ‌తో అలంక‌రిస్తారు.

కుండపైన ఒక దీపం కనిపిస్తూ ఉంటుంది. వాటిని నెత్తిన పెట్టుకుని.. డ‌ప్పు చ‌ప్పుళ్ల మధ్య మ‌హిళ‌లు ఆల‌యానికి తీసుకెళ్తారు. బోనాల కుండ‌ల‌ను నైవేద్యంగా స‌మ‌ర్పిస్తారు.

గ్రామాల్లో దీన్నే పెద్ద పండుగ, ఊర పండుగ అని కూడా పిలుస్తుంటారు. రంగం పేరిట భ‌విష్యవాణి చెప్పే ఆచార‌ం ఈ బోనాల పండుగ‌లో కనిపిస్తుంది. జాన‌ప‌ద క‌ళ‌లు, డ‌ప్పుల చ‌ప్పుళ్లు, శివ‌స‌త్తుల విన్యాసాల‌తో పండగ వాతావరణం ఉంటుంది.

 

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh