దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును మంగళవారం (ఫిబ్రవరి 7) హైదరాబాద్‌లో బుచ్చిబాబును అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు రాత్రే కి రాత్రే అతనిని ఢిల్లీ తరలించారు. అయితే బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖులకు ఛార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించారు. ఆయన పేరుమీద గోరంట్ల మరియు అసోసియేట్స్, శ్రీ ఎంటర్ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మూడు సంస్థలు ఉన్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని,మరియు హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న, వ్యవహారంలో గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా, పలు కీలక ఆధారాలు సేకరించగా తర్వాత ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.
ఢిల్లీకి తరలించిన అనంతరం రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో బుచ్చిబాబును సీబీఐ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టును కోరనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం పాలసీలో ఆడిటర్ బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించినట్లు సీబీఐ గుర్తించింది.ఈ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైకి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా బుచ్చిబాబు పనిచేశారు.
ఇది కూడా చదవండి :