ఏపీలో రేషన్ కార్డు ఉన్నవాళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్
ఏపీలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అయితే కరోనా తరువాత ప్రజల ఆహార అల్లవాట్లు మారినాయి. ఎక్కువ ప్రొటీన్ ఫుడ్, బలవర్ధక ఆహారం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో రైస్ బదులు పోషక విలువలున్న ఇతర ధాన్యాలను ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఐక్యరాజ్యసమితి కూడా 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించి ఆ దిశగా ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గత నెల 18న సీఎం జగన్ సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. బియ్యం కంటే రాగులు, జొన్నలకు అయ్యే ఖర్చే తక్కువ అలాగే ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే రేషన్ బియ్యం బదులు రాగులు, జొన్నలు పంపిణీ చేయాలని సూచించారు.
రాగులు, జొన్నలకు సంబంధించి ఇప్పుటికే ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసకున్నారు. అయితే మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు. పంపిణీకి అవసరమైన రాగులు, జొన్నలను సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా రైతుల నుంచి మద్దతు ధరకు సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రేషన్ షాపుల్లో గోధుమ పిండిని కూడా పంపిణీ చేస్తోంది పౌరసరఫరాల శాఖ. కేజీ గోధుమ పిండి ప్యాకెట్ రేటును మొత్తం 16 మున్సిపాలిటీల పరిధిలో ఉన్న సుమారు 7 లక్షల బియ్యం కార్డుదారులకు ఫిబ్రవరి నుంచి రాయితీపై గోధుమపిండి అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కో రేషన్ కార్డుపై నెలకు 2 కిలోల గోధుమపిండిని. కిలో రూ.16 చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో కార్డుదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు త్వరలో రాగులు, జొన్నలను కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేషన్‌కార్డుదారులకు ఇస్తున్న ఉచిత బియ్యంలో 2 కేజీలు తగ్గించి వాటి స్థానంలో రాగులు, జొన్నలను రాయితీపై పంపిణీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరిస్తున్నాం. రైతులకు మద్దతు ధర ప్రకటించి అమలు చేశామని ఇటీవలే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 21 రోజులల్లోపే ధాన్యం సేకరణకు సంబంధించి సొమ్ములు చెల్లిస్తున్నామన్నారు. అలాగే కందిపప్పు బాగోలేదని చాలా మంది ఫిర్యాదు చేశారని. బండి దగ్గరే కందిపప్పును ఉడకబెట్టి నాణ్యత పరిశీలించాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి :