Amrutha Pranay Case: ప్రణయ్ హత్య కేసు తీర్పు అనంతరం అమృత షాకింగ్ పని

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కేసులో తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఏ 2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధించిన కోర్టు మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇదే సమయంలో అమృత చేసిన పనికి అందరూ షాకయ్యారు.

ప్రణయ్ హత్య కేసులో ఇంత కాలానికి న్యాయం గెలిచిందని, తమ కన్నీళ్ళ పోరాటానికి ఫలితం ఈ తీర్పుగా వచ్చిందని ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు అమృత కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ హత్య జరిగిన సమయంలో నాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ కు కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధి వద్దకు వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమృత మాత్రం ఏ కారణం చేతనో భర్త సమాధి దగ్గరకు వెళ్లలేదు. తుది తీర్పు వచ్చిన తర్వాత తన ఇంస్టాగ్రామ్ లో రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రమే పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో అమృత చేసిన షాకింగ్ పని వల్ల సోషల్ మీడియాలో ఆమె పైన పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది.

ఇంతకాలం అమృత ప్రణయ్ గా ఉన్న అకౌంట్ పేరును కాస్త అమృత ఇప్పుడు అమృత వర్షిని అనే పేరుగా మార్చేశారు. భర్త మరణం తర్వాత ఫైనల్ తీర్పు రాగానే అమృత ప్రణయ్ అన్న పేరులోని ప్రణయ్ పేరును తీసివేయడంతో నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు. అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని రెండో పెళ్ళికి సిద్ధమైపోయింది అంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ప్రణయ్ పేరు తన పేరులో నుండి తీసేయటం వల్ల అందరూ ఇలా అనుకుంటున్నారు. లేదంటే ఈ సమయంలో ప్రణయ్ పేరును అమృత తన పేరులో నుంచి ఎందుకు తీసివేసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఇంతకాలం ప్రణయ్ కోసమే బతుకుతున్నట్టుగా చెప్పుకున్న అమృత ఇప్పుడు తన పేరులోంచి ప్రణయ్ పేరును తీసివేయడంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అమృత తర్వాత ఏం చేస్తుంది అన్నది అందరిలో ఆసక్తి అయితే తన పేరులోంచి ప్రణయ్ పేరు తీసివేయడం వెనుక కారణం ఏమిటి అన్నది అమృత పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నవారు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కొంతమంది ఇంకేముంది అంతా అయిపోయింది.. మళ్లీ పెళ్లి చేసుకుంటుంది అంటుంటే మరి కొంతమంది తను ఏం చెప్పబోతుందో తెలియకుండా తొందరపడి మాట్లాడటం తప్పని చెబుతున్నారు.

Leave a Reply

Dimple Hayathi In Shankars Movie keerthi suresh