Ambedkar Statue: అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ కు సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం
Ambedkar Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆయన మనవడు, లోక్‌సభ మాజీ ఎంపీ ప్రకాశ్ అంబేద్కర్ శుక్రవారం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రకాష్ అంబేద్కర్‌కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి లాంఛనంగా సమావేశం నిర్వహించి, అనంతరం ప్రకాష్ అంబేద్కర్‌కు మధ్యాహ్న భోజనాన్ని కూడా ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎంపీలు జే సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్‌ఎస్ మహారాష్ట్ర నేత, ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్ అన్నా ధోంగే, దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం 125 అడుగుల Ambedkar Statue ఆవిష్కరించేందుకు ప్రకాష్ అంబేద్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి అక్కడికి బయలుదేరారు. విగ్రహన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకాష్ అంబేద్కర్ ప్రసంగించారు.
సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరమని మాజీ ఎంపీ అంబేద్కర్ మనమడు ప్రకాష్ అంబేద్కర్ చెప్పారు.
సమాజంలో మార్పు కోసం నిత్యం సంఘర్షణ తప్పదన్నారు. రూపాయి సమస్యపై అంబేద్కర్ 1923లోనే పరిశోధన పత్రం రాశారని ఆయన గుర్తు చేశారు. బ్రిటీష్ పాలకులు ఇండియాను ఎలా దోచుకుంటున్నారో గ్రహించారన్నారు. Ambedkar Statue ఏర్పాటు చేసినందుకు కేసీఆర్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని అంబేద్కర్ కోరుకున్నారని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ ఆదర్శాలు పాటించడమే ఆయనకు నిజమైన నివాళిగా ప్రకాష్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రజలంతా విద్యావంతులు కావాలని అంబేద్కర్ కోరుకున్నారన్నారు.
ఆర్ధిక దుర్భలత్వంపై పోరాడేందుకు కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దళితబంధు పథకం రూపొందించేందుకు కేసీఆర్ కు ప్రకాష్ అంబేద్కర్ ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని ప్రకాష్అంబేద్కర్ చెప్పారు.
పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం త్యాగం చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసేవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటం సాగిన విషయాన్ని ప్రకాష్ అంబేద్కర్ గుర్తు చేశారు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ది సాధ్యమని అంబేద్కర్ భావించేవారని ప్రకాష్ అంబేద్కర్ విరించారు.
దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ చెప్పారన్నారు. ఇండియాకు రెండో రాజధానిగా హైద్రాబాద్ సరైందని అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రకాష్ అంబేద్కర్ ప్రస్తావించారు. పాకిస్తాన్, చైనా నండి హైద్రాబాద్ ఎంతో దూరంలో ఉంటుందన్నారు. భారత్ కు హైద్రాబాద్ రెండో రాజధానిగా ఉండాలన్న అంబేద్కర్ ఆశయం నెరవేరలేదని ప్రకాష్ అంబేద్కర్ తెలిపారు.