Ambati Rayudu : ఏపీ సీఎంను కలిసిన అంబటి రాయుడు
Ambati Rayudu : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నేడు (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు
. ఈ సందర్భంగా సీఎం జగన్ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
అయితే గతకొద్ది రోజులుగా ఆంధ్ర క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లోకి వస్తున్నాడనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. నేడు ఏపీ సీఎం జగన్‌ను కలవడంతో ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది.
ఇక గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లు ఇప్పటికే చెప్పాడు. Ambati Rayudu :
దీంతో అప్పటినుంచి ఏ పార్టీలో చేరనున్నాడనే విషయంపై ఆసక్తి నెలకొంది. రాయుడిని ఏపీ బీఆర్ఎస్లోకి తీసుకునేందుకు ఏపీ అధ్యక్షుడు తోటం చంద్రశేఖర్.
. రాయుడిని కలిసినట్లుగా అప్పుడు న్యూస్ వచ్చింది. అంతేకాకుండా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ కూడా ఆఫర్ చేసారంట .
అయితే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు.. సినీ హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారనే ప్రచారం కూడా అప్పట్లో జోరుగా సాగింది. టీడీపీలో చేరే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.
అయితే కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి జగన్ ను ప్రశంసిస్తూ అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెడుతున్నారు. సీఎం జగన్ ప్రసంగాన్ని తన ట్విట్టర్ ఖాతా లో షేరి చేసిన రాయుడు గ్రేట్ స్పీచ్ అంటూ ప్రశంసించారు. రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ మీ మీద నమ్మకం..విశ్వాసంతో ఉన్నారంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి పోస్టు చేసారు.
దీంతో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్న రాయుడు ఐపీఎల్ పూర్తి అవ్వటంతోనే వైసీపీ ద్వారా పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభిచేందుకు సిద్దమయ్యారని ప్రచారం మొదలైంది.
Ambati Rayudu : అయితే అంబటి రాయుడు క్రికెట్ అకాడెమీ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నారని చెబుతున్నారు.
దానికి భూమి అడిగేందుకు జగన్ ను కలిశారన్న అభిప్రాయం కూడా ఒక వైపు వినిపిస్తోంది. ఏదిఏమైనా ఈ రోజున తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి అంబటి రాయుడు వెళ్ళడం పొలిటికల్ గా మరింత ఆసక్తిని పెంచుతుంది.