రెండో పెళ్లి పై క్లారిటి ఇచ్చిన మీనా
ఒకప్పటిస్టార్ హీరోయిన్ మీనా భర్త ఇటీవలే మృతి చెందిన విషయం అందరకు తెలిసిందే. ఏడాది జూన్ 28న మీనా భర్త విద్యా సాగర్ కరోనా కారణంగా వచ్చిన ఇన్ఫెక్షన్ల కారణంగానేమీనా భర్త చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే చిన్న వయసులోనే మీనా భర్తను కోల్పోయారు భర్త మృతి చెందిన విషాదంలో నిండిపోయిన మీనా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్నారు.
ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. మీనాను పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె మరో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మీనా వయసు 46 ఏళ్లు. అయితే ఆమె భర్త చనిపోవడంతో రెండో వివాహం చేసుకోమని పేరెంట్స్ ఒత్తిడి చేస్తున్నారట. ఆడపిల్లకు మగతోడు అవసరం. కూతురు భవిష్యత్తు బాగుండాలన్నా, నీకు భర్త ఉంటే మంచిదని సలహా ఇస్తున్నారట. కానీ మీనాకు మాత్రం రెండో వివాహం పట్ల ఏమాత్రం ఆసక్తి లేదట
అయితే కుటుంబ సభ్యులు మాత్రం మీనాను తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. దీంతో మీనా ఫ్యామిలీ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారనే మాట వినిపిస్తోంది . సదరు వ్యక్తి ఫ్యామిలీ ఫ్రెండ్ అనే సమాచారం. చాలా కాలంగా మీనా కుటుంబంతో అనుబంధం ఉందని సమాచారం. 2009లో మీనా వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ ని వివాహం చన్నారు.
మీనాకు ఒక ఆరాడేళ్ల పాప ఉన్నారు. భర్త మరణంతో మీనా ఒంటరి అయ్యారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా మగ తోడు కోల్పోవడం మీనాను కుంగదీసింది. దీంతో ఆమె షూటింగులకు కూడా రాకుండా చాలా రోజుల పాటు మీనా ఒంటిరిగా ఉండిపోయారు. ఈ ఏడాది ప్రారంభంలో నటి మీనా కుటుంబం కరోనా బారిన పడింది. కుటుంబ సభ్యులందరికి కరోనా మహమ్మారి సోకింది. ఈ కరోనా కొందరిలో తీవ్రమైన ప్రభావం చూసింది. మరికొందరిలో స్వల్పంగా ప్రభావం చూసింది. ఇది సాధారణ జనాల నుంచి వీఐపీల వరకు ఏ ఒక్కరిని వదల్లేదు.
ఇది కూడా చదవండి: