సీనియర్ డైరెక్టర్ మృతి
గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది కృష్ణ, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణతో పాటు పలువురు ప్రముఖులు మరణించగా. ఇటివల అలనాటి అందాల తార, సీనియర్ నటి జమున (86) జనవరి 27న కన్నుమూశారు. ఆ విషయాన్ని పూర్తిగా మరువకముందే నేడు (ఫిబ్రవరి 2)న సీనియర్ దర్శకుడు నిర్మాత విద్యా సాగర్ రెడ్డి(70) ఈ రోజు ఉదయం 05:20 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు ఈ రోజు ఉదయం ( గురువారం) మరణించారు. 1952లో గుంటూరులో జన్మించిన సాగర్.. కెరీర్ తొలినాళ్లలో చాలా సినిమాలకు ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో విడుదలైన ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా మారారు. స్టువర్టుపురం దొంగలు (1991) మూవీ ఆయనకు దర్శకుడిగా గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రం 3 నంది అవార్డులు గెలుచుకోవడం విశేషం. తరువాత ఓసి నా మరదలా (1997), రామసక్కనోడు (1999), అమ్మదొంగ (1995), అన్వేషణ (2002), యాక్షన్ నెం.1 (2002), ఖైదీ బ్రదర్స్ (2002) వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు ఇదే అయన చివరి చిత్రం. అలాగే సీనియర్ డైరెక్టర్ విద్యాసాగర్ రెడ్డి మృతి పట్ల సిని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాఈ రోజు సాయంత్రం చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి:
- సుప్రీం మూడు రాజధానులు వద్దంటే కేంద్రంపైనే ఒత్తిడి అంటున్న కొడాలి
- కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభంచేసిన కేటీఆర్