Komatireddy వెంకట్ రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసులు
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు జారీ చేసింది కాంగ్రెస్. స్టార్ట్ క్యాంపెయినర్‌గా ఉంటూ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయకపోగా… తన సోదరుడికి సాయం చేయడం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ క్రమశిక్షమ సంఘం మరోసారి నోటీసులు జారీ చేసింది. పదిరోజుల గడువుతో గతంలో నోటీసులు ఇచ్చింది. వాటికి వెంకట్‌రెడ్డి స్పందించలేదు.
మునుగోడు నోటిఫికేషన్ పడిన తర్వాత కొన్ని రోజు సైలెంట్‌గా ఉండిపోయిన వెంకట్‌రెడ్డి… ప్రచారం పీక్స్‌కు చేరే సరికి ఆస్ట్రేలియా చెక్కేశారు. అంతే కాదు అక్కడి నుంచి తన అనుచరులకు ఫోన్లు చేసి… సోదరుడు, బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయానికి సాయం చేయాలని రిక్వస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అయింది.
ఈ ఆడియో, వీడియో టేపులపై వివరణ ఇవ్వాలని… ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పదిరోజుల క్రితం షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
2. కేసీఆర్ అవమానించలేదు – ప్రగతిభవన్ ఘటనపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటన :
తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎం కేసీఆర్ తనను అవమానించారటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి… కేసీార్ తండ్రి లాంటి వారన్నారు. గురువారం జరిగిన ప్రెస్ మీట్ లో తండ్రి హోదాలో మంత్రులను ఒక వైపు ఎమ్మెల్యేలను ఓ వైపు కూర్చోవాలని చెప్పారు. తాను ఎమ్మెల్యేల వైపు కూర్చునేందుకు సిద్ధమవుతున్ నసమయంలో.. మంత్రుల వైపు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారన్నారు. అంతే తప్ప తనను సీఎం కేసీఆర్ అవమానించలేదన్నారు.
3. బాలకృష్ణ కొడితే అభిమానం, నేను చేస్తే తప్పా? :
బాలకృష్ణ కొడితే అభిమానం అంటున్నారని, అదే పని నేను చేస్తా తప్పా అని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. తన నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలం అలిదినె ఓబాయపల్లెలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేశాయిరెడ్డితో ఉన్న చనువుతో చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి చూపిందన్నారు. కొన్ని పత్రికలు కరపత్రాలుగా తయారయ్యాయని విమర్శించారు. వారి రాతల ద్వారా సాధించేమీ లేదని 2019లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేశారని ఆరోపించారు. అప్పుడు వచ్చిన ఫలితమే వచ్చే ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందన్నారు. దేశాయిరెడ్డి మాట్లాడుతూ తనపై ఉన్న అభిమానంతోనే ఎమ్మెల్యే కోప్పడ్డాడని తమకు ఎలాంటి విభేధాలు లేవన్నారు. తాము మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయులమని కొన్ని పత్రికలు, ఛానళ్ళు భూతద్దంలో చూపించాయన్నారు. తనను సంప్రదించి విషయం తెలుసుకొని వార్తలు రాయాలని సూచించారు.
4. డ్యాన్స్ చేయాలంటే స్టెప్స్ రావాల్సిన పనిలేదు.. కోరిక ఉండాలంటే.
ఇటీవల కాలంలో ఏం చేసిన వీడియోలు, ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.. అవి కాస్త బాగా వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పెళ్లిళ్లకు చెందిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అవును పెళ్లి అంటే సందడే సందడి.. బోలెడంత హడావుడి. బంధుమిత్రులు అంతా వచ్చి తెగ సందడి చేసేస్తారు. ఇక పెళ్లికొడుకు, పెళ్లి కూతురుని ఓ వారం రోజుల పాటు సెలబ్రిటీలుగా చూస్తారు. పెళ్లి పూర్తయ్యేంత వరకూ వాళ్లకు స్పెషల్ స్టేటస్ ఉంటుంది.
పెళ్లి తరవాత జరిగే “బరాత్” తంతులోనూ వరుడు, వధువులదే హవా. వివాహ వేడుక సందర్భంగా స్నేహితులు, బంధువులు చేసే హంగామా గురించి ఎంత చెప్పినా తక్కువే.. చిలిపి పనులు, డ్యాన్స్ , వంటి అనేక తీపి జ్ఞాపకాలను వధూవరులకు ఇస్తారు.
అంతేకాదు కొంతమంది స్నేహితులు తమతో పాటు వధూవరులు కూడా డ్యాన్స్ చేయాలంటూ పట్టుబడతారు. చేసేవరకూ అటు ఫ్రెండ్స్ ఇటు రిలేటివ్స్ వదిలిపెట్టరు. కచ్చితంగా కాలు కదపాల్సిందేనని పట్టు పడతారు. ఆ మధ్య “బుల్లెట్టు బండి” పాటకు డ్యాన్స్ చేసి ఓ నవ వధువు ఎంత ఫేమస్ అయిందో చూశాం. ఇప్పుడు ఓ వరుడు కూడా చాలా ఫేమస్ అయిపోయాడు. కాకపోతే.. ఈ స్టెప్లు కాస్త విచిత్రంగా ఉన్నాయనుకోండి. మొత్తానికి ఇరగదీసిండనే చెప్పాలి… బ్యాండ్ వాళ్లు మ్యూజిక్ మొదలెట్టగానే ఫన్నీగా డ్యాన్స్ చేశాడు ఓ వరుడు.
5. సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2024లో మళ్లీ పోటీ చేయాలని యోచిస్తున్నట్లు సంకేతాలిచ్చారు. అయోవాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. మరోసారి వైట్ హౌస్ బిడ్ చేస్తానని చెప్పాడు. మరోసారి పోటీ చేసి అధ్యక్ష పదవీని దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2024లో పదవీని దక్కించుకోవడం ఖాయమంటూ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం అయోవాలోని సియోక్స్ సిటీలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో తిరిగి అధికారంలోకి రాబోతోతున్నాము.. వైట్ హౌస్‌ను తిరిగి దక్కించుకుంటామని పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు ముందు ఆయన రిపబ్లికన్ల కోసం ప్రచారం చేయనున్నారు.
6. యూట్యూబ్‌లో కొత్త సదుపాయం.
వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube)కు కొత్త ఫీచర్ వస్తోంది. చానెల్స్‌లోని వీడియోలను మూడు సపరేట్ ట్యాబ్స్‌లో యూట్యూబ్ విభజించనుంది. ఇటీవలి కాలంలో యూట్యూబ్‌కు చాలా కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ కొత్త ట్యాబ్స్ సదుపాయాన్ని కూడా యూట్యూబ్ తీసుకొచ్చింది. దీంతో ఏదైనా యూట్యూబ్ చానెల్ పేజ్‌లో లాంగ్ వీడియోలు, షార్ట్స్, లైవ్ వీడియోలను సులువుగా గుర్తించవచ్చు. అసలు ఏంటి ఈ కొత్త ఫీచర్, ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుకోండి.
ఏదైనా యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేస్తే ఇప్పటి వరకు సాధారణ లాంగ్ వీడియోస్, షార్ట్స్, లైవ్ వీడియోలు ఒకే ఫీడ్‌లో వరుసగా కనిపించేవి. చానెల్లో వెతికేందుకు కూడా కాస్త కష్టపడాల్సి వచ్చేది. అయితే యూట్యూబ్ కొత్తగా ఓ సదుపాయాన్ని తీసుకొస్తోంది. చానెల్ పేజీలో ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు, షార్ట్స్‌కు ప్రత్యేకమైన ట్యాబ్స్ ఉంటాయి. లైవ్ వీడియోలకు కూడా మరో ట్యాబ్ కూడా ఉంటుంది.
7. మస్క్ మామ లెక్క మాములుగా లేదుగా.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. అపరకుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలాన్ మస్క్ అత్యంత భారీ మొత్తానికి ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. కొన్ని నెలలుగా సాగిన రాజకీయ పరిణామాలకు ఫుల్స్టాప్ పెడుతూ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఏకంగా 44 బిలియన్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. టెక్ రంగంలో ఇదొక అతిపెద్ద డీల్‌గా నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కొనుగోలు వ్యవహారం ముగిసిందో లేదో మస్క్ తన మార్క్‌ను చూపించడం ప్రారంభించాడు.
తనదైన నిర్ణయాలతో ట్వి్ట్టర్లో ఒక్కసారిగా అలజడి సృష్టించాడు. సంస్థ చేతికొచ్చిన తొలి రోజే సమస్క్.. అప్పటి వరకు సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను తొలగించి తీవ్ర చర్చకు దారి తీశాడు. అంతేకాకుండా ఉద్యోగాలను భారీ ఎత్తున తొలగించేందుకు రంగం సిద్ధం చేశాడు. ఏకంగా 3700 మందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమవుతున్నాడు మస్క్. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న బ్లూటిక్ సేవలకు స్వస్తి పలికేందుకు సిద్ధమవుతున్నాడు. బ్లూటిక్ మార్క్ ఉండాలంటే నెలకు 20 డాలర్లు చెల్లించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు.
ఈ నిర్ణయంపై తీవ్రంగా వ్యతిరేక రావడంతో 20 డాలర్లను కాస్త 8 డాలర్లకు తగ్గించారు.
8.అవతార్ 2′ ట్రైలర్: సరికొత్త ఊహా లోకంలోకి తీసుకెళ్లిన కామెరూన్..!
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ వెండి తెరపై సృష్టించిన విజువల్ వండర్ ”అవతార్”. 2009 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్.. ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించి. బాక్సాఫీస్ వద్ద ఎన్నో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు 13 ఏళ్ళ తర్వాత రాబోతున్న ”అవతార్ 2” సినిమాపై అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.అవతార్’ సినిమాకి కొనసాగింపుగా మరో నాలుగు సినిమాలు చేస్తున్నారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.
ఇందులో భాగంగా ముందుగా ”అవతార్: ది వే ఆఫ్ వాటర్” ని రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మోస్ట్ ఎవైటెడ్ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ అనూహ్య రెస్పాన్స్ తెచ్చుకోగా.. తాజాగా మరో కొత్త ట్రైలర్ ని సోషల్ మీడియా వేదికగా ఆవిష్కరించారు.అవతార్’ సినిమాతో ప్రేక్షకుల్ని పాండోరా గ్రహంలో విహరింపజేసిన జేమ్స్ కామెరూన్.. ఇప్పుడు ”అవతార్ 2” లో సముద్ర గర్భంలోని తీసుకెళ్లి మరో సరికొత్త ఊహా లోకాన్ని పరిచయం చేశారు. సముద్రంపై అవతార్స్ చేస్తున్న విన్యాసాలు మరియు అబ్బురపరిచే గ్రాఫిక్స్ కనువిందు చేస్తున్నాయి.
9. తొలిసారి ఆ అవార్డుకు కింగ్ కోహ్లీ నామినేట్
అక్టోబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లు ప్రకటించింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ తొలిసారి ఈ అవార్డులకు నామినేట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆటగాడు సింకిందర్ రజా అతడికి పోటీగా ఉన్నారు. మహిళల విభాగంలో భారత్ నుంచి జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ ఎంపికయ్యారు.