Milkshake Side Effects: మిల్క్ షేక్‌లతో మైండ్‌ షేక్ అయ్యే ప్రమాదం.. జాగ్రత్త!

మిల్క్‌షేక్ రుచిగా, చల్లగా, క్రీమీగా ఉండి అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ దీనిని అధికంగా తాగితే మెదడుకు తీవ్రమైన నష్టం కలిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిల్క్ షేక్‌లలో ఉండే అధిక చక్కెర, కొవ్వు మెదడు కణాలను దెబ్బతీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.

మిల్క్ షేక్ అంటే ఏమిటి?

పాలు, ఐస్ క్రీమ్, ఫ్లేవరింగ్ సిరప్‌లు లేదా పండ్లతో కలిపి తయారుచేసే రుచికరమైన పానీయం మిల్క్‌షేక్‌. చాక్లెట్, వెనిల్లా, స్ట్రాబెరీ ఫ్లేవర్లు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. పైభాగాన విప్డ్ క్రీమ్, చెర్రీ, చాక్లెట్ చిప్స్‌తో అలంకరించి పార్టీలు, వేడుకల్లో ప్రత్యేకంగా వడ్డిస్తారు.

మెదడుపై ప్రభావం

మిల్క్ షేక్‌లో అధిక చక్కెర, కొవ్వు, కేలరీలు ఉండటంతో తరచూ తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగి తగ్గుతాయి. దీనిని బ్లడ్ షుగర్ ఫ్లక్చుయేషన్ అంటారు. ఈ హెచ్చుతగ్గులు న్యూరాన్‌లపై ఒత్తిడిని పెంచి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి.

అధిక చక్కెర ఉన్న ఆహారం వల్ల:

జ్ఞాపకశక్తి తగ్గుతుంది

న్యూరాలజికల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది

మెదడులోని హిప్పోక్యాంపస్ భాగం బలహీనమవుతుంది

ప్రత్యామ్నాయం ఏమిటి?

మిల్క్ షేక్‌లకు బదులుగా తాజా పండ్లను పాలు, పెరుగు, తేనె లేదా బెల్లం కలిపి స్మూతీగా తీసుకోవచ్చు. పిల్లలకు చక్కెర పానీయాల బదులు పండ్లు తినే అలవాటు పెంచడం మంచిది.

రుచిగా ఉంటుందనే కారణంగా మిల్క్ షేక్‌లను ఎక్కువగా తాగితే మెదడుకు నష్టం కలుగుతుంది. కాబట్టి సహజమైన, ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవడం ద్వారా మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

Leave a Reply