పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు షాక్.. 3 నెలల్లోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి..!

పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో స్పీకర్ మూడు నెలల వ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. కోర్టులో వేసిన అనర్హత పిటిషన్‌ను కొట్టి వేయడమే కాకుండా, అక్టోబర్ 31వ తేదీలోపు తుది తీర్పు తీసుకోవాలంటూ స్పష్టమైన గడువు విధించింది.

సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పార్టీ ఫిరాయింపుల కేసులపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. స్పీకర్ విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించకూడదని స్పష్టంగా పేర్కొంది.

పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలు వీరే:

దానం నాగేందర్

తెల్లం వెంకట్రావు

కడియం శ్రీహరి

పోచారం శ్రీనివాస్ రెడ్డి

బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

కాలే యాదయ్య

ప్రకాశ్ గౌడ్

అరికెపూడి గాంధీ

మహిపాల్ రెడ్డి

సంజయ్ కుమార్

ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారారని ఆరోపిస్తూ పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, కేటీఆర్ సహా ఇతర నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు అన్ని పిటిషన్లను సమీక్షించి స్పీకర్‌కు స్పష్టమైన గడువు విధించింది.

ఇప్పటికే BRS వర్గంలో ఉప ఎన్నికల అంచనాలు మొదలయ్యాయి. ఇక స్పీకర్ నిర్ణయం ఏవిధంగా ఉంటుందన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply