తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, తమ ప్రభుత్వం రెండున్నరేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుందన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ సభలో ఆయన మాట్లాడారు.
వచ్చే రెండున్నర సంవత్సరాలలో నిరుద్యోగులకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము – సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/aGoFxAL6cD
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025
ఈ సందర్భంగా సీఎం పేర్కొన్న ముఖ్య విషయాలు ఇవే:
తెలంగాణలో కొత్తగా 3.58 లక్షల రేషన్ కార్డులు జారీ చేశామన్నారు.
దీంతో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలుకు చేరిందని తెలిపారు.
కొత్త కార్డులతో 11.3 లక్షల మందికి లబ్ధి కలుగుతుందని చెప్పారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ:
“మా ప్రభుత్వ లక్ష్యం రెండున్నరేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వడం. అలాగే మొత్తం రెండేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం.”
మరోసారి కేసీఆర్ మీద నోరుపారేసుకున్న రేవంత్ రెడ్డి
కాళేశ్వరం వద్ద కేసీఆర్ను ఊరి తీయాలి అంటూ నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డి pic.twitter.com/QQFwzB5ucU
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025
బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు:
“బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందా?” అంటూ సీఎం నిలదీశారు.
“మేము సన్నబియ్యం ఇస్తే చూసి ఓర్వలేకపోతున్నారు.” అన్నారు.
“కేసీఆర్ హయాంలోనే కట్టిన కాలేశ్వరం కూలేశ్వరం అయ్యింది, కూలేశ్వరం దగ్గర వారిని ఉరి తీసినా తప్పులేదు.” అన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి, “గంజికి లేని నాయకుడు, బెంజిలో తిరుగుతున్నాడు” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ఆయన ఉన్నది మూడు అడుగులు.. ఆరు అడుగులు ఎగురుతున్నాడు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
గ్లాసులో సోడా పోసిన అంత ఈజీ కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడం – రేవంత్ రెడ్డి pic.twitter.com/CEbRd5fu6X
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025
ప్రభుత్వ పనితీరు హైలైట్స్:
రూ.2 లక్షల రుణమాఫీ హామీని అమలు చేశామన్నారు.
రైతులకు కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులు అందించామన్నారు.
రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నంబర్ వన్ అని ప్రకటించారు.
ఫ్రీ బస్సు ప్రయాణానికి రూ.6,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.
రాబోయే ఎన్నికలపై రేవంత్ క్లారిటీ:
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తుడిచిపెట్టాలని పిలుపునిచ్చారు.
“రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది,” అని ధీమాగా ప్రకటించారు.
“ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది” అని గుర్తు చేశారు.