సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుంటూరు కారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముందు పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్ గా ఫిక్స్ చేసి శ్రీ లీల సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ మహేష్ డేట్స్ విషయంలో క్లాషెస్ వల్ల సినిమాలు వాయిదా పడుతూ వచ్చింది. అయితే పూజా బేబీ ఆ టైం లో ఇచ్చిన డేట్స్ అన్ని వేస్ట్ అయ్యాయి.
ఇక కొత్తగా ఆమె మరో సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వగా ఆ టైం లో గుంటూరు కారం మేకర్స్ డేట్స్ అడిగారట. సో అలా అమ్మడు ఆ సినిమా నుంచి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సినిమాలో సెకండ్ హీరోయిన్ అనుకున్న శ్రీ లీల మెయిన్ హీరోయిన్ అయ్యింది మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమా నుంచి పూజా బయటకు రావడం వల్ల ఇద్దరు కొత్త హీరోయిన్స్ కు సూపర్ స్టార్ ఛాన్స్ దక్కింది. ఇదిలాఉంటే మహేష్ సినిమా నుంచి పూజా తప్పుకున్నా ఆమెను ఎలాగైనా సరే సినిమాలో భాగం చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఎలాగు సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ అలానే ఉంది కాబట్టి సినిమాలో పూజా బేబీ చేతనే ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తే పని అయిపోతుందని అనుకుంటున్నారట. పూజా కూడా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేయాల్సిన పని ఉండదు కాబట్టి ఆ ఆఫర్ కు ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. సో హీరోయిన్ గా చేయాల్సిన గుంటూరు కారంలో పూజా హెగ్దే ఐటం సాంగ్ తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.